అఖిల్ మీడియా మీట్ లో నాగ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja


నిన్న అఖిల్ సినిమా వాయిదా వెనుక కారణాలను వివరంచడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాగార్జున మాటలు విని మీడియా ప్రతినిధులు కూడా షాక్ అయినట్లు టాక్. గ్రాఫిక్స్ సరిగ్గా రాకపోవడం వల్లనే ‘అఖిల్’ సినిమా వాయిదా వేసాం తప్ప మరేకారణాలు అఖిల్ వాయిదా వెనుక లేవని చెపుతూ నాగార్జున ‘బాహుబలి’ ఘన విజయంతో  సినిమా ప్రేక్షకులకు గ్రాపిక్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమైపోయిందని కామెంట్స్ చేసాడు నాగ్. 

అందువల్ల ‘అఖిల్’ సినిమా విషయంలో వీలయినంత జాగ్రత్తలు తీసుకుని గ్రాఫిక్స్ చేయిస్తున్నాము అంటూ ‘అఖిల్’ సినిమా వాయిదాకు గల కారణాన్ని ‘బాహుబలి’ పై తోసివేసాడు నాగ్. అంతేకాదు  ఒక్క సీక్వెన్స్ లో గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదని మరో వారం పది రోజుల్లో గ్రాపిక్స్ వర్క్ పూర్తయిన తరువాత సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామూ అంటూ అఖిల్ వాయిదా వెనుక మరి ఏ కోణాలు అంటూ వివరణ ఇచ్చాడు. 

అయితే ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘బహుబలి’ గ్రాఫిక్స్ కు 50కోట్ల  బడ్జెట్ తో తీసిన ‘అఖిల్’ కు సంబంధం ఏమిటి అని కామెంట్ చేసుకున్నట్లు టాక్ . ఇంతటి తో ఆగ కుండా నాగార్జున ఈ సినిమాలో ‘అఖిల్’ డాన్స్ మూమెంట్స్ చూసి షాక్ అయ్యాను అంటూఒక ఆ సక్తికర విషయాన్ని బయట పెట్టాడు.  

ఈ సినిమా పాటలలోని  ‘అఖిల్’ డ్యాన్సులు చూసి ఇంటికొచ్చాక తాను  ఐదు నిమిషాలు అఖిల్ ను చూస్తూ ఉండిపోయానుఅని చెపుతూ  తన  ఇంట్లో ఇలాంటి డ్యాన్సర్ తిరుగుతున్నాడా ఆశ్చర్యపోయాను అని కామెంట్ చేయడం మరీ అతిగా ఉంది  అని ఆ మీడియా మీట్ కు వచ్చిన కొందరు కామెంట్ చేసుకున్నట్లు టాక్. బహుశా ఈ సినిమా వాయిదా వల్ల అఖిల్ ఇమేజ్ పై ఎటువంటి నెగిటివ్ టాక్ రాకుండా ఈ వ్యాఖ్యలు నాగ్ చేసాడు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: