సిద్దార్థ్ ట్విస్ట్ తో సమంత మైండ్ బ్లాంక్ !

Seetha Sailaja


ఒకనాటి ప్రియ స్నేహితుడు సిద్దార్థ్ ఇచ్చిన లేటెస్ట్ ట్విస్ట్ తో సమంత మైండ్ బ్లాంక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న దసరా సందర్భం సమంత నటించిన ’10 ఎంద్రాదుకుల’ సినిమాకు పోటీగా నయనతార నటించిన 'నానుమ్ రౌడీ దాన్' విడుదల అయింది. సమంత సినిమా ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే నయనతార సినిమా సూపర్ హిట్ అయింది. 

దీనితో ఆనందం పట్టలేక సమంత మాజీ స్నేహితుడు సిద్దార్థ్ తన మాజీ స్నేహితురాలి ఫెయిల్యూర్ ను ఎంజాయ్ చేస్తూ తన ట్విట్టర్ లో నయనతార ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సమంతసినిమా పై సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేసాడు సిద్ధార్ద్. ‘ఎక్కడ చూసినా బీభత్సమైన రెస్పాన్స్ విజయ్ సేతుపతి, నయన్ అదరగొట్టారు. అందుకే ఇప్పుడు పంపిణీదారులు అందరు షోలు పెంచేస్తున్నారు’ అంటూ ఈ సినిమాను నిర్మించిన ధనుష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ పెట్టాడు సిద్దార్థ్.

ఈమధ్య కాలంలో వివరస విజయాలతో దూసుకుపోతున్న నయన తార ‘నానుమ్ రౌడీ దాన్ హిట్ తో మరో హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తే ఈ సినిమాను నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ రూపొందించాడు.  ఈసినిమా తీసే టైములోనే ఇద్దరూ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. 

ఇక ఈసినిమాలో నయన్ చాలా సన్నగా ఫ్రెష్ గా కనిపిస్తుండటంతో కోలీవుడ్ మీడియా నయన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ వ్రాస్తోంది. ఈ సినిమా విజయవంతం అయితే  దర్శకుడు సంతోష్ శివన్ ను నయన్ పెళ్ళి  చేసుకుంటుంది అని వార్తలు ఇప్పటికే వస్తున్న నేపధ్యంలో నయనతార – సంతోష్ శివన్ ల పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: