గాయని సునీత.. ఆ యాంగిల్లో అదరగొట్టేసింది..!?

Chakravarthi Kalyan
ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఓ ప్రియురాలి విరహవేదనను అందంగా ఆలపించిన గాయని సునీత తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పేరుకి గాయనే అయినా సునీత బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవాలి. గాయనిగా ఆమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో దాదాపు 3,000 పైచిలుకు సినిమా పాటలు పాడింది. ప్రస్తుతం బుల్లితెరపై అనేక సంగీత కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. 

సునీత కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ కళాకారిణిగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియ, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బింద్రె, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్..ఇలా ఎందరో నటీమణుల నటనకు ఆమె తన గాత్రంతో ప్రాణం పోశారు. అయితే గాయని, డబ్బింగ్ ఆర్టిస్, జడ్జి.. ఇంతవరకూ సునీతలో మనం చూసిన కోణాలివి. 

లేటెస్టుగా తనలో మరో కోణం ఉందని సునీత నిరూపించారు. ఆమే స్వయంగా తనలోకి ఆ కోణాన్ని ఆవిష్కరించారు. అదే పేరడీ నటన. ఇంగ్లీష్ లో చెప్పాలంటే డబ్ స్మాష్. ఇప్పటి యూత్ కు ఇదో కొత్త ట్రెండ్. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నటీనటులను అనుకరిస్తూ నటించడం దీని ప్రధాన లక్షణం. అయితే ఒరిజినల్ ఫీల్ కోసం సదరు నటీనటుల గాత్రాన్ని మాత్రం అలాగే వాడతారు. 

అంటే వీడియో అనుకరించేవారిది.. ఆడియో అసలు నటీనటులదని అన్నమాట. ఈ ప్రక్రియ మొదలయ్యాక చాలామంది తమ అభిమాన నటులను అనుకరిస్తున్నారు. గాయని సునీత కూడా లేటెస్టుగా కోవై సరళ నటనను అనుకరిస్తూ నటించి ఓ వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో కోవై సరళ భర్తకు భయపడే భార్యగా హాస్యం పండించారు. అందులో బ్రహ్మానందం - కోవై సరళ మధ్య వచ్చేఓ హాస్య సన్నివేశాన్ని సునీత అనుకరించారు. ఇప్పుడీ వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: