కమల్ తో లిప్ లాక్ కష్టాలు తెచ్చిపెట్టింది..!

shami
నిన్న రిలీజ్ అయిన చీకటి రాజ్యం సినిమా మిక్సెడ్ టాక్ వచ్చినా డిఫరెంట్ సినిమాలను చూసే ప్రేక్షకులు సినిమాకు మంచి మార్కులే వేస్తున్నారు. ఇక కమల్ నటనకు మంత్ర ముద్గులైన అభిమానులైతే కమల్ చేసిన ఈ సింపుల్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కి ఫిదా అయిపోయారు. అయితే వయసు 60 ఏళ్లు దాటినా కమల్ తన సినిమా అన్ని రంగాల వారికి నచ్చే అంశాలు సినిమాలో ఉండేలా జాగ్రత్త పడతాడు. ఆ దారిలోనే చీకటి రాజ్యం సినిమాలో హాట్ లిప్ లాక్స్ ప్లాన్ చేశాడు. తెలుగు హీరోయిన్ మధుశాలినితో హాట్ లిప్ లాక్ శృంగార ప్రియులను భలే ఆకర్షించింది.


సినిమాలో ఉన్న మధుశాలిని లిప్ లాక్ సీన్ అదరిపోయింది. అయితే కమల్ తో సినిమా అనగానే ఎగిరి గంతేసిన తెలుగమ్మాయి మధుశాలిని కమల్ తో లిప్ లాక్ అనే సరికి కాదనలేకపోయింది. అయితే సినిమాలో అది అవసరమా కాదా అన్నది పక్కన పెడితే మధుశాలినికి ఈ లిప్ లాక్ కష్టాలు తెచ్చిపెట్టిందని అంటుంది కోలీవుడ్ మీడియా. కమల్ హాసన్, త్రిష జంటగా నటించిన చీకటి రాజ్యం సినిమా కోలీవుడ్లో దీపావళికి తూంగావనం పేరుతో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.


చీకటి రాజ్యం సినిమాలో కమల్ హాసన్, మధు శాలిని :


అయితే సినిమాలో మధుశాలినితో కమల్ అదరచుంభనం చూసిన అక్కడ దర్శక నిర్మాతలు తమ సినిమాలో ఆఫర్ ఇస్తాం వాటిల్లో కూడా లిప్ లాక్స్ చేస్తావా అని అడుగుతున్నారట. బాబోయ్ ఒక్క సినిమాలో లిప్ లాక్ సై అంటే ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయేంటని అమ్మడు ఖంగారు పడుతుందట. సీనియర్ హీరో కదా అని కమల్ తో ఓకే చెబితే అది కాస్త అన్ని ఇలాంటి ఆఫర్లే రావడం అమ్మడిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలేవి లేని మధుశాలినికి ఇది ఓ మంచి బ్రేక్ ఇచ్చే సినిమానే అయినా అమ్మడు ఎందుకో వెనుకడుగు వేస్తుంది.


మరి వచ్చిన అవకాశాలను సై అని నయా లిప్ లాక్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేక వాటన్నిటికి నో చెప్పి వచ్చిన అర కొర చాన్సులతో సర్ధుకుపోతుందో చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం చీకటి రాజ్యం సినిమా మంచి టాక్ తో రన్ అవుతుంది. త్రిష కూడా ఈ సినిమాలో యాక్షన్ లేడీగా అదరగొట్టింది. 49 వ సినిమాగా చీకటి రాజ్యం త్రిష కెరియర్ ని సంథింగ్ స్పెషల్ చేసింది. ఇక తన 50వ సినిమాగా నాయకి సినిమ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: