ఆ హీరోయిన్ కి అండగా కోనవెంకట్

E. Rama Krishna
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ అంజలి. గతంలో అంజలి పర్సనల్ లైఫ్ వివాదాలకు దారి తీయటంతో, తన ఫిల్మ్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని అందరూ భావించారు. అయితే ఆ ఎఫెక్ట్ ఎంతో కాలం లేదు. తక్కువ రోజుల్లోనే అంజలి తన వ్యక్తిగత లైఫ్ సమస్యలను బాగానే సాల్వ్  చేసుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో  అంజలి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.


క్రేజీ ఫిల్మ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్స్ ని గడుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అంజలి మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది. మంచు విష్ణు ఇప్పుడు జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ‘సరదా’ పై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ హీరోయిన్ ని ఇప్పుడు రిప్లేస్ చేయి మరో స్టార్ హీరోయిన్ ని తీసుకోనున్నారు.


తనే అంజలి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ మార్పుపై సంచలనంగా మారింది. గత కొంత కాలంగా అమలాపాల్ సైతం ఈ మూవీలో నటించనుందని అంటూ టాక్స్ వినిపిపించాయి. కానీ చివరగా ఈ ఆఫర్ అంజలికి దక్కింది. అంజలికి ఈ ఆఫర్ వరించటం వెనుక కోనవెంకట్ కీలకపాత్ర వహించాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కోనవెంకట్ మూవీలలో అంజలి వరుస మూవీలు చేస్తుంది.


అంజలికి మంచి కథలు ఉన్న మూవీలలో ఆఫర్స్ వచ్చేందుకు కోనవెంకట్ తెగ శ్రమిస్తున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం సైతం కీలక పాత్రలో నటించనున్నాడు. కేవలం కామెడీ కోసం కాకుండా బ్రహ్మానందానికి కీ రోల్ ఇవ్వటంతో ఇది ఆసక్తిగా మారింది. మొత్తంగా అంజలి కోసం కోనవెంకట్ చేస్తున్న ప్రయత్నం అందరిలోనూ పలు అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: