ఘంటసాల ఏసుదాస్ లపై ఈర్ష్యతో బాలు కామెంట్స్ !

Seetha Sailaja
బాల సుబ్రహ్మణ్యం తన తొలి పాట పాడి 50 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా అమరగాయకుడు ఘంటసాల ప్రముఖ గాయకుడు ఏసదాస్ లపై సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలు.

తాను సినిమాలలో పాటలు పాడటం ప్రారంభించి వేలాది సంఖ్యలో పాటలు పాడినా తనకు ఇప్పటికీ ఏసుదాస్ కంఠస్వరం వింటే ఈర్ష్య కలుగుతుందని అదేవిధంగా అమరగాయకుడు ఘంటసాల పాడిన పద్యాలు వింటే తనకు అటువంటి ప్రతిభ ఎందుకు దేవుడు ఇవ్వలేదు అన్న ప్రశ్న తనను వెంటాడుతూనే ఉంటుందని ఈ ఇద్దరి ప్రముఖల గాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు ఎస్.పి. బాలు.

దేశంలోని అనేక భాషలలో గతంలో రోజుకు 10 పాటలు పాడిన తనకు కూడ రికార్డింగ్ ధియేటర్ వరకు వెళ్ళి తాను ఆ పాటలను పాడలేను అని తిరిగి వచ్చేసిన సందర్భాలు తన జీవితంలో అనేకం ఉన్నాయి అంటూ తనకు గతంలో కొన్ని అనివార్యమైన కారణాలు వల్ల తన గొంతుకు శస్త్ర చికిత్స జరిగినప్పుడు 6 నెలలు పాటలు పాడకుండా కాలం గడిపిన రోజులు తన జీవితంలో తనకు ఎదురైనా అత్యంత భయంకరమైన చీకటి రోజులు అని అంటూ అలనాటి ఘాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు బాలు. 

తనకు జన్మను ఇచ్చిన తల్లితండ్రులకు గాయకుడిగా జన్మను ఇచ్చిన కోదండ పాణికి మొట్టమొదటి అవకాశం ఇచ్చిన నటుడు పద్మనాభానికి ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తన జీవితం సరిపోదు అని అంటూ తనలోని వినమ్రతను మరోసారి బయట పెట్టాడు ఈ గాన గాంధర్వుడు. ఎన్నో విషయాల పై తనకు ఎంతో తెలిసినా ఏమి తెలియదు అని అనుకుని జీవించడంలో ఆనందం ఉంటుంది అని బాలు చెపుతున్న మాటలలో ఎంతో వేదాంతం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: