యువహీరోల్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టైల్. ఒకరు హావభావాలను అద్భుతంగా పలికిస్తారు. మరొకరు ఫైట్లు అద్భుతంగా చేస్తారు. ఇంకొకరు డాన్సుల్లో ఇరగదీస్తారు. మరొకరు డైలాగులు పలకడంలో పాతతరం హీరోలనూ మరిపిస్తారు. మరి, యువ హీరోల్లో మీకు ఎవరు ఇష్టమంటే... యువసామ్రాట్, మన్మథుడు, కింగ్ నాగార్జున ఏమన్నాడో తెలుసా... తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ‘హీరోకు ఉండాల్సిన ప్రధాన లక్షణం... అందంతోపాటు గాత్రం. ఆ గాత్రం నుంచి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే డైలాగులు.
అలా ప్రేక్షకులను కట్టిపడేసే కంఠం, డైలాగులు చెప్పే నైపుణ్యం ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో యువహీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ వేరు. అందుకే, జూనియర్ అంటే నాకు ఇష్టం. అలాగని మిగతా వాళ్లంటే ఇష్టం కాదని కాదు. మిగతా వాళ్లు మిగతావిషయాల్లో నచ్చుతారు’ అని తప్పుకున్నాడు నాగ్.
మరింత సమాచారం తెలుసుకోండి: