నందమూరి బాలకృష్ణకు ఉండే ఫ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత అని తెలుసుకోవాలంటే ఓ హిట్ కొడితే బాలయ్య సినిమాకు వచ్చే కలక్షన్స్ తో లెక్క చూసుకోవాల్సిందే. అయితే బాలయ్య అభిమానులు ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక బాలయ్య వాడిన సినిమాలో డైలాగులైతే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో చెక్కర్లు కొడతాయి.
సేం అలానే ఇప్పుడో బాలయ్య సంతకం కూడా నెట్ లో హల్ చల్ చేస్తుంది. బాలయ్య సంతకం ఎలా వచ్చిందో ఏమో తెలియదు కాని బాలయ్య సంతకం గురించి ఫ్యాన్స్ దానికో ట్యాగ్ తగిలించి వాయించేస్తున్నారు. లెజెండ్ సినిమాలో ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు.. నేను వాడికి ఎదురెళ్లినా వాడికే రిస్కు అనే డైలాగ్ ఉంది కదా.. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ ను బాలయ్య సంతకం కింద ఇలా మార్చి రాశారు.
నెట్లో హల్ చల్ చేస్తున్న బాలయ్య సైన్ :
ఈ సంతకాన్ని ఒకడు కాపీ కొట్టాలన్నా వాడికే రిస్కు.. ఫోర్జరీ చేయాలన్నా వాడికే రిస్కు .. జై బాలయ్య అంటూ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ గా డిక్టేటర్ సినిమాతో ఫ్యాన్స్ ని అలరించిన బాలయ్య సినిమాతో మరోసారి తన మాస్ పవర్ ఏంటో చూపించాడు. ఇక డ్యాన్సుల్లో సాటి మేటి యువ హీరోలు కూడా పోటీ పడలేరు అన్నంతలా కష్టపడి మరి చేశారు.
ప్రస్తుతం ఈ సైన్ కింద మ్యాటర్ ఉన్న ఈ పిక్ సోషల్ సైట్స్ లో వైరల్ గా స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య 100వ సినిమా కోసం ఆదిత్య 999 తీసే ఆలోచనలో ఉన్నాడు. సినిమాకు కథ సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో తన వారసుడు మోక్షజ్ఞ ను కూడా తెరంగేట్రం చేయిస్తున్నట్టు సమాచారం.