ఐఫా ను క్యాష్ చేసుకున్న అఖిల్ చరణ్ లు ?

Seetha Sailaja
మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశం ద్వారా కోట్లు గణించు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయానికి ‘ఐఫా’ వేడుకలు కూడ ఉదాహరణగా మారాయి అన్న వార్తలు వస్తున్నాయి. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలలో ఈ ఉత్సవ నిర్వహాకులు డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారు అనే వార్తలు వస్తున్నాయి.

చెన్నై వరద బాధితుల సహాయం కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమం తన లక్ష్యాన్ని తప్పి మన సెలెబ్రెటీలకు ఆదాయం కలిగించే కార్యక్రమంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న గాసిప్పుల ప్రకారం ఈ కార్యక్రమంలో లైవ్ డాన్స్ పెర్ఫామెన్స్ లు చేసిన రామ్ చరణ్ కు కోటి రూపాయలు అఖిల్ కు 40 లక్షల రూపాయలు పారితోషికాలుగా ముట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

దాదాపు 7 నిముషాల పాటు కూడ లేని వీరి లైవ్ పెర్ఫార్మెన్స్ లకు ఈ రేంజ్ లో భారీ పారితోషికాలు ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఒక ఉదాత్త ఆశయం కోసం ‘ఐఫా’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కూడ మన సెలెబ్రెటీలు భారీ స్థాయిలో పారితోషికాలు తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఎంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమo వల్ల పేరు డబ్బు క్రేజ్ మన దక్షిణాది సెలెబ్రెటీలకు వస్తే చిట్టచివరిగా అసలు లక్ష్యమైన చెన్నై వరద బాధితుల సహాయానికి కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే సహాయంగా అందించి ఉంటారు అన్న అంచనాలు గాసిప్పులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా మన సెలెబ్రెటీలు ‘ఐఫా’ ను క్యాష్ చేసుకున్నారు అని అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: