చిరంజీవి 150వ సినిమా ప్రారంభం కాకుండానే ఎన్ని కష్టాలు వస్తున్నాయో బాలకృష్ణ తన 100వ సినిమాగా చేద్దాం అనుకున్న ‘ఆదిత్య 999’ కు ఊహించని కష్టాలు వస్తున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఎప్పటి నుంచో దర్శకుడి బోయపాటి బాలయ్య 100వ సినిమాకు దర్శకుడు అన్న ఫీలింగ్ బాలకృష్ణ అభిమానులలో ఉన్న నేపధ్యంలో ఇటీవల అనేక ఇంటర్వ్యూలలో బాలయ్య ‘ఆదిత్య 999’ సినిమా గురించి స్వయంగా ప్రస్తావించి సింగీతం శ్రీనివాసరావు తన 100వ సినిమాకు దర్శకత్వం వహిoచే అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనితో బాలకృష్ణ అభిమానులు తమ హీరో 100వ సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండాలి. ఆ స్థాయిలో సింగీతం శ్రీనివాసరావు ఎలా తీయగలరు అని తీవ్ర మధన పడుతున్నారు. ఈవిషయాలు బాలకృష్ణ వరకు చేరడంతో తన ‘ఆదిత్య 999’ మూవీ ప్రాజెక్ట్ లో సింగీతం శ్రీనివాసరావుకు సహకరించాడానికి దర్శకుడు విఎన్ ఆదిత్యను కూడ రంగంలోకి దించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ లాంటి ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను దర్శకత్వం వహించిన ఆదిత్యా సింగీతంతో కలిసి ఈ ‘ఆదిత్యా 999’ కు ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నట్లు టాక్.
ఈ న్యూస్ బాలయ్య అభిమానులను మరింత గందరగోళంలో పడేసింది అని అంటున్నారు. దీనికి కారణం ప్రస్తుత ట్రెండ్ తెలియని ఇద్దరు డైరెక్టర్స్ బాలయ్య 100వ సినిమా స్క్రిప్ట్ ను తయారుచేయడం ఏమిటి అని బాలయ్య అభిమానుల గోల. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ కూడ బయటకు వచ్చింది. టైమ్ మిషన్ లో అనుకోకుండా ఎక్కిన బాలకృష్ణ కాకతీయ సామ్రాజ్యా కాలానికి వెళ్ళి పోతాడని అప్పటి పరిస్థుతులు గోనగన్నారెడ్డి పాత్రలు ఈ ‘ఆదిత్యా 999’ లో ఉండబోతున్నాయని టాక్.
అయితే ఇప్పటికే ‘రుద్రమదేవి’ సినిమాలో కాకతీయసామ్రాజ్యం గోనగన్నారెడ్డి పాత్రను చూసిన ప్రేక్షకులకు మళ్ళీ కొత్తగా ‘ఆదిత్యా 999’ ఏమి చూపెడతారు అనే భయం కూడ బాలయ్య అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. ఇలా రకరకాల గందరగోలాల మధ్య రూపొందుతున్న బాలకృష్ణ ‘ఆదిత్యా 999’ కథ సరిగ్గా కుదరకపోతే అసలుకే మోసం వస్తుందా అని బాలకృష్ణ అభిమానులు తీవ్ర టెన్షన్ లో ఉన్నారు అనే గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..