ప్రస్తుతం నాగార్జున కుటుంబంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి నాగ్ కు ఊహించని షాక్ గా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ను తన ఇద్దరి కొడుకులతో షేక్ చేయాలని నాగార్జున ‘అఖిల్’ సినిమా ద్వారా చేసిన ప్రయత్నం వికటించడంతో నాగ్ ఇక తన కొడుకుల పై ఆశలు పెట్టుకోకుండా తన స్పీడ్ పెంచి ‘సోగ్గాడే చిన్ని నాయన’ ద్వారా 50 కోట్ల హీరోగా మారిపోయాడు.
అయితే తన కొత్త సినిమాల విషయం పై దృష్టి పెడుతూ మళ్ళీ తన కొడుకుల సినిమాల గురించి ఆలోచిస్తున్న నాగ్ కు ఒక అనుకోని సంఘటన ఎదురైంది అని టాక్. అఖిల్ రెండవ సినిమా గురించి నాగార్జున ఆలోచనలు చేస్తూ ఉంటే ఊహించని విధంగా చైతూతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు అని ఫిలింనగర్ టాక్.
అంతేకాదు ప్రస్తుతం అఖిల్ తో సినిమాలు చేస్తాము అని నాగార్జున వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకన్నా నాగచైతన్యతో సినిమాలు చేస్తాము అని మోజు పడుతున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది అని టాక్. దర్శకుడు శ్రీవాస్ తన దగ్గర ఒక మoచి సబ్జెక్ట్ వుందని రకుల్ జోడీగా సినిమా చేద్దామని అంటుంటే సెల్వ రాఘవన్, హరీష్ శంకర్ లు నాగచైతన్య కోసం కథలు రాసుకుని రెడీగా ఉన్నారట.
ఆఖరికి నాగార్జునకు ఊహించని ఘన విజయాన్ని ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కూడ అఖిల్ తో కంటే వెంటనే నాగచైతన్యతో సినిమాను చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో చైతన్యకు ఏర్పడిన అనుకోని క్రేజ్ కు ఆనంద పడుతూనే అఖిల్ విషయంలో ఎటువంటి దర్శకుడును వెతకాలి అన్న షాక్ లో నాగార్జున ఉన్నట్లు ఫిలింనగర్ గాసిప్..