హీరోయిన్స్ ను వెంటాడుతున్న మహాలక్ష్మీ సెంటిమెంట్ !

Seetha Sailaja
ప్రస్తుతం ఫిలింనగర్ లో ఒక విచిత్ర సెంటిమెంట్ కు సంబంధించిన వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్స్ కు ఈ సెంటిమెంట్ బాగా ఒంటపట్టినట్లుగా తెలుస్తోంది. గత సంవత్సర కాలం నుండి టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా బాగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

హెబా పటేల్, సోనారికా, కీర్తి సురేశ్, దిశా పటానీ లాంటి కొత్త హీరోయిన్స్ కు ఈ వింత కోరిక కలిగింది అని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం వారు నటించే కొత్త సినిమాలలోని వారి పాత్రలకు మహాలక్షీ అని పేరు పెట్టమని తమ సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలను అడుగుతున్నట్లు టాక్.

ఆశక్తికరమైన ఈ వార్తల వివరాలలోకి వెళితే ఈ కొత్త హీరోయిన్స్ అంతా ఈ మహాలక్ష్మి పేరు పై మోజు పడటానికి ఒక కారణం ఉంది. లేటెస్ట్ గా విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో హీరోయిన్ మెహిరిన్ నటించిన పాత్ర పేరు మహాలక్ష్మీ. ఈ సినిమా కథ అంతా ఈమె ప్రేమ చుట్టూ తిరగడమే కాకుండా ఈసినిమా విజయం తరువాత ఈమెకు టాలీవుడ్ లో చాల ఆవకాసాలు వస్తున్నాయి అని తెలుస్తోంది. 

టాప్ హీరోయిన్ కాజల్ లుక్స్ ఈమెలో అక్కడక్కడ కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతల దృష్టి ఈమె పై పడింది. అదేవిధంగా నాగచైతన్య సినిమాలలో సూపర్ హిట్ గా నిలిచిన ‘100% లవ్’ సినిమాలో తమన్నా నటించిన పాత్ర పేరు కూడ మహాలక్ష్మి. ఇలా  మహాలక్ష్మి పేరును తామునటిస్తున్న సినిమాలలోని పాత్రలకు పేరుగా పెడితే ఆ సినిమాలు గ్యారింటీ హిట్ అవుతాయని ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తున్న యంగ్ హీరోయిన్స్ నమ్మకం అని టాక్. ఏమైనా సెంటిమెంట్ లేకుండా సినిమా సెలెబ్రెటీల జీవితాలు గడవవు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: