నానీకి పుట్టినరోజు బహుమతిగా హెలికాప్టర్ !

Seetha Sailaja
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హీరోగా నాని రేంజ్ ని మరో మెట్టు ఎక్కించింది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాలో నటించిన చిన్న పాప నైనాను మరిచి పోలేకపోతున్నారు. తన ముద్దుముద్దు మాటలతో ఆ సినిమాలో నటించిన నైనా తన పేరు ‘చిన్నారి పెళ్ళికూతురు’ అని తెలివిగా సమాధానం చెప్పడమే కాకుండా నాని ‘బొమ్మతో ఆ ఆటలు ఏమిటి’ అని అడిగినప్పుడు ‘అది బొమ్మ కాదు జెస్సీ’ అంటూ ముద్దుగా సమాధానాలు చెప్పిన ఈ పాప నటన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ కు గుండెకాయలా నిలిచింది. 

ఈ పాప పుట్టింది పెరుగుతోంది అమెరికాలోనే అయినా ఈ సినిమా కోసం అమెరికా నుండి ప్రత్యేకంగా ఈ పాపను తీసుకు వచ్చి కొన్ని నెలలు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ సినిమా కోసం రెడీ చేసారు. ఈసినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత తిరిగి ఈ పాప అమెరికాకు వెళ్ళి పోయింది. 

అయితే ఈ పాప అమెరికాకు వెళ్ళిపోయాక నానీని మరిచిపోకుండా తరుచు ఫోన్ చేస్తూనే ఉంటుందట. రెండు మూడు రోజుల క్రితం జరిగిన నానీ పుట్టినరోజు సందర్భంగా నైనా నానీకోసం ఒక ప్రత్యేకమైన వాయిస్ మెసేజ్ పంపింది. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ లో తెలియచేయడమే కాకుండా నైనా పంపిన మెసేజ్ తాలూకు యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు. 

ఈ మెసేజ్ లో నైనా అతిముద్దుగా నానీకి విషస్ చెపుతూ ‘నాని అన్నా హ్యాపీ బర్డ్ డే,  నీకు ఏం గిఫ్ట్ కావాలి, సైకిల్ కావాలా, ఏరోప్లేన్ కావాలా హెలికాఫ్టర్ కావాలా’ అని అడుగుతూ ‘నేను నీకు ఏరోప్లేన్ ఇవ్వను, హెలికాఫ్టర్ ఇస్తా, ప్రామిస్’ అంటూ ముద్దు ముద్దుగా ఆ చిన్నారి చెప్పిన మాటలు ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. నాని తన పుట్టినరోజు హెలికాఫ్టర్ బహుమతిగా వచ్చినందుకు పొంగి పోతున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: