2012 : హీరో | హీరోయిన్ | సినిమా | దర్శకుడు | సంగీతం | విలన్ | కామెడీ
ప్రపంచ స్థాయి సాంకేతికతతో, అనుభవజ్ఝులైన జర్నలిజం మిత్ర బృందంతో, తాజా, సంచలన వార్తా విశ్లేషణలతో... ప్రారంభించిన అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఎపిహెరాల్డ్.కామ్ పోర్టల్, వెబ్ జర్నలిజం రంగంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది తెలుగువారిని పోర్టల్ [ఎపిహెరాల్డ్.కామ్] ద్వారాను, సోషల్ నెట్ వర్కింగ్ [ఫేస్ బుక్, ట్విట్టర్] తోనూ అనుసంధానిస్తూ నిర్వహించిన అన్ లైన్ సర్వే తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలోనే సరికొత్త విధానంలో సాగింది.
2012 తెలుగు సినిమా - ఉత్తమ విలన్ విభాగంలో ‘సోనూసూద్’,‘ప్రకాష్ రాజ్’, ‘ దేవ్ గిల్ ’ తో బరిలో నిలిచిన కన్నడ హీరో ‘సుదీప్’ ఈ సంవత్సర ఉత్తమ తెలుగు విలన్ గా ఎంపిక అయ్యాడు.
సర్వే వివరాలు : ఉత్తమ విలన్
సుదీప్
‘సుదీప్’ తెలుగు వాళ్ళకి కొత్తేమో కానీ, కన్నడలో సూపర్ స్టార్, నిర్మాత మరియు దర్శకుడు కూడా. అల్లాంటి సుదీప్ ఒక తెలుగు సినిమాలో విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాడంటేనే ఆ పాత్ర ప్రాముఖ్యత ఏమిటో అర్థం అవుతుంది. నిజంగా చెప్పాలంటే ‘ఈగ’ విలన్ పాత్ర ప్రాధాన్యంగా నడిచే సినిమా, ఆపాత్రకు సుదీప్ అందరూ భయపడేలాగా, ద్వేషించేలాగా... 100% న్యాయం చేశాడు. కాదు... జీవించాడు. ‘ఈగలు పగలుపడతాయా’ అని అమాయకంగా అడిగినా... ‘నాని గా నిన్ను బతకనివ్వనను’ అని క్రోధావేశంతో అరచినా... ‘స్త్రీలోలుడు గా’ సమంతా వెనుక పడినా... విలన్ పాత్ర పండింది. సుదీప్ ‘2012 ఉత్తమ తెలుగు విలన్’ గా ఎన్నికయ్యాడు.
సోనూసూద్
ఈ సర్వేలో రెండవ ఉత్తమ విలన్ గా సోనూసూద్ నిలిచాడు. ‘జులాయి’ సినిమాలో సోనూసూద్ నటనగానూ ఉత్తమ విలన్ జాబితాలో రెండవ స్థానం దక్కించుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన జులాయి సోనూసూద్ లోని కొత్త నటుడ్ని తెరమీదకు తీసుకుని వచ్చింది.