తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ సినిమాపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఈ మద్య పవన్ కళ్యాన్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో దీనిపై మరిన్ని చర్చలు మొదలయ్యాయి. మరోపక్క పవన్ తెలుగు మీడియాను వదిలి బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అయితే సినిమా విడుదల కావడానికి కాస్త టైం ఉంది కనుకనే ఇలా చేశారని ఆడియో రిలీజ్ అయ్యాక సినీ ప్రమోషన్ టైమ్ లో అన్ని మీడియాలు కవర్ చేస్తారని మరికొందరు అంటున్నారు.
ఏది ఏమైనా ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ సెన్సేషనల్ న్యూస్ లే వస్తున్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ విడుదల తేదీతో పాటు ఆడియో రిలీజ్ తేదీని ఫైనల్ చేశారు నిర్మాత శరత్ మరార్. ప్రమోషన్ లో భాగంగా మొదటి మేకింగ్ సరి కొత్త పిక్స్ ని రిలీజ్ చేసి మరి కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో లో నిర్మాత ఆడియో ఎప్పుడనేది చెప్పేశారు.
సర్దార్ గబ్బర్ సింగ్ లో రాయ్ లక్ష్మీ, పవన్ కళ్యాన్
తాజాగా ఇందులో నటిస్తున్న హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ సరి కొత్త పిక్స్ ని రిలీజ్ చేసి మరి కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఐటమ్ సాంగ్ షూట్ చేసే సమయంలో కొన్ని సెల్ఫీలు..కొన్ని స్టిల్స్ విడుదల చేసి హల్ చల్ సృష్టించింది. అంతే కాదు సర్దార్ షూటింగ్ లో తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని..టీమ్ సభ్యులు మంచి జోష్ మీదే ఉండేవారిన చాలా ఫన్నీగా సాగిపోయిందని తెలిపారు...ఇక పవన్ కళ్యాన్ ‘నైసెస్ట్ పర్సన్’ అని కితాబిచ్చింది.
రాయ్ లక్ష్మీ ట్విట్స్ :
Just spotted tis in my latest album😁had so much fun shooting fr #SardaarGabbarSingh n knowing a nicest person #pspk😊 pic.twitter.com/IuARDQg5Ga— RAAI LAXMI (@iamlakshmirai) March 12, 2016