వారసత్వ హీరోల పై సుమలత సెటైర్లు !

Seetha Sailaja
అనుకోకుండా సినిమాలలోకి వచ్చి 1980 – 1990 ప్రాంతాలలో గ్లామర్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సుమలత నిన్న ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ సినిమా రంగం పై అలనాటి హీరోల పై అనేక కామెంట్స్ చేసింది. తాను నటించిన 22 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలైన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆనాడు తన తరం హీరోయిన్స్ డబ్బు కన్నా సినిమాలో నటించబోయే పాత్ర గురించి ఎక్కువ శ్రద్ధ చూపెవాళ్ళం అంటూ అలనాటి రోజులను గుర్తుకు చేసుకుంది.

ఇదే సందర్భంలో తన భర్త కన్నడ హీరో అంబరీష్ గురించి మాట్లాడుతూ తాను అంబరీష్ ను పెళ్ళి చేసుకున్నాక సంవత్సరం మించి కలిసి ఉండరు అంటూ అప్పట్లో చాలామంది హీరోలు సెటైర్లు వేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అలాంటి హీరోలు తమ షష్టిపూర్తి ఫంక్షన్ కు వచ్చి అంబరీష్ ను ఇంత కాలం ఎలా భరించావు అన్న సెటైర్లను బయట పెట్టి తనకు ఉన్న సహనం గురించి వెల్లడించింది. 

ఇదే సందర్భంలో తన కొడుకు గురించి మాట్లాడుతూ లండన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తనకొడుకు భవిష్యత్ లో బిజినెస్ చేస్తాడు అన్న విషయాన్ని బయట పెట్టింది సుమలత. తన కొడుకును హీరోగా చేసి బలవంతంగా జనం పై రుద్దే ఉద్దేశ్యం తనకు కానీ తన భర్త అంబరీష్ కు కాని లేదు అంటూ వారసత్వ హీరోల పై సెటైర్లు వేసింది సుమలత. తన కొడుకు చిన్నపాటి నుండి తన తండ్రి సినిమాలు చూసి చిన్న పిల్లలు స్కూల్ లో డ్రిల్ చేస్తున్నట్లు ఆ డాన్స్ లు ఏమిటి అని అంటూ తన తండ్రి అంబరీష్ పైనే సెటైర్లు వేసేవాడని అంటూ నీకు నటించడం రాదు అంటూ తన పై సెటైర్లు వేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంది సుమలత. 

తన మొదటి సినిమా పారితోషికం 1000 రూపాయలు అన్న విషయాన్ని బయట పెడుతూ ఆ మొట్టమొదటి పారితోషికం ఇచ్చింది నిర్మాత రామానాయుడు అంటూ ‘సినిమాలకు తగని మనస్తత్వం నాది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆనాటి అందాల భామ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: