బాహుబలి డిలే అవడానికి కారణం అదేనా..!

shami
జక్కన చెక్కే బాహుబలి సినిమా మొదటి భాగానికి రెండో భాగానికి రెండు సంవత్సరాల గ్యాప్ రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ముందు 2016లో రిలీజ్ చేద్దామనుకున్న బాహుబలి రెండవ భాగం 2017 ఏప్రిల్ 17దాకా ఎందుకు పోస్ట్ పోన్ అవాల్సి వచ్చింది.. ఆల్రెడీ బాహుబలి మొదటి పార్ట్ కోసం వేసిన సెట్స్ లోనే ఈ రెండో పార్ట్ కూడా ఎంతోకొంత షూట్ చేసే అవకాశం ఉంది కదా అంటే.. కరెక్ట్ కాని సినిమా రిలీజ్ 2017 దాకా వెళ్లడానికి అసలు రీజన్ వేరే ఉందట.


ప్రభాస్, రానాలు సినిమా కోసం దేహ దారుడ్యాన్ని బాగా పెంచారు. అయితే సైజ్ జీరో కోసం అనూహ్యంగా 20 కిలోల బరువు పెరిగిన అనుష్క ఇంకా బరువు తగ్గలేదట. ఆ కారణం చేతనే అనుకున్న టైంలో షూటింగ్ కంప్లీట్ అవ్వదని రిలీజ్ ను ముందే పోస్ట్ పోన్ చేసుకున్నాడు రాజమౌళి. ఒకరకంగా అనుష్క వల్లే బాహుబలి సెకండ్ పార్ట్ డిలే అవుతుంది అన్నది టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే కేరళలో షూటింగ్ స్టార్ట్ చేసిన బాహుబలి టీం మరింత కట్టుదిట్టమైన షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేసుకోబోతుంది.


సైజ్ జీరోలో అనుష్క :


అయితే వేరే సినిమాల కారణాల వల్ల అనుష్క తన సినిమా లేట్ కు కారణం అవుతున్న సందర్భంలో రాజమౌళి అనుష్క మీద కాస్త కోపంగా కూడా ఉన్నాడట. అది కాక మరో పక్క సింగం-3 సినిమాకు కూడా ఆమె బాహుబలికి పార్లెల్ గా ఇచ్చిందట. అయితే ఆ విషయం తెలుసుకున్న మన జక్కన్న సింగం పూర్తి చేసుకున్నాకే బాహుబలి టీంలో జాయిన్ అవ్వు అని అన్నాడట. 


సైజ్ జీరో కోసం అంతల కష్టపడ్డ స్వీటీ అనుష్క పోనీ ఆ సినిమా ఏమన్నా హిట్ అయ్యి తనకు మంచి పేరు తెచ్చి పెట్టింది లేదు.. మరి అనుష్క ఇదంతా ముందే ఊహించిందా లేక తనకు తెలియకుండానే జరిగిందా అన్నది తెలియాలి. ఇక కొద్ది రోజులుగా అమ్మాడిని చూద్దామన్నా కనుమరుగైంది.. ఒకేసారి బొద్దుగా ఉన్న అమ్మడు మళ్లీ లావు తగ్గి దర్శనమిచ్చే ఆలోచనల్లో ఉందేమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: