క్రమ శిక్షణకు మారుపేరుగా నిలిచే మోహన్ బాబు ఈమధ్య సినిమాలలో పెరిగిపోతున్న బూతు డైలాగుల డోసేజ్ పై తరుచు తన అసహనాన్ని వ్యక్త పరుస్తూ ఉంటాడు. అయితే అటువంటి మోహన్ బాబు మాటలను కూడ అతడి కొడుకు మంచు విష్ణు లెక్క చేయలేదా అని అనిపించే ఒక ఆసక్తికర విషయం ఈమధ్య లేటెస్ట్ గా జరిగింది. యూత్ ను ఆకర్షించడానికి తమ సినిమాలలో బూతులు గ్లామర్ డోసేజ్ లు పెంచవలసి వస్తున్న పరిస్థుతులలో ఈ మారుతున్న పరిస్థుతులకు విష్ణు కూడ రాజీ పడ్డాడా అని అనిపించేట్లు ఉంది.
మంచు విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలో ఈ సంఘటన జరిగింది. ఈసినిమాను ఫుల్ ఆఫ్ గ్లామర్ డోసేజ్ తో దర్శకుడు నాగేశ్వరరెడ్డి నింపేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఓ వైపు సోనారికా మరోవైపు హెబ్బాపటేల్ ఈసినిమా కోసం చేసిన ఎక్స్ పోజింగ్ లో హద్దులు లేవు అని అంటున్నారు.
ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ సాంగ్ ‘కో కో కోడి’ లో విష్ణు రాజ్ తరుణ్ లు ఈ సినిమా హీరోయిన్స్ సోనారికా హెబ్బాపటేల్ తో చేసిన రొమాన్స్ చూసిన వారు అదిరి పోతున్నారు. ఈ పాటలోని గ్లామర్ షో చూసిన తరువాత ఈసినిమా హాస్య సినిమానా ? లేదా బూతు సినిమానా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి.
ఒక పంజాబీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాను యూత్ మెచ్చుకునే విధంగా తీయడానికి ఇలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ ను ఆయుధంగా వాడారా అని అనిపించడం సహజం. ఈమధ్య కాలంలో విష్ణు నటిస్తున్న సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాపులుగా మారుతూ ఉండటంతో విష్ణు కూడ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ ను ఆధారంగా చేసుకుని హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడనుకోవాలి. ఒకవైపు మోహన్ బాబు బూతుల పై యుద్ధం చేస్తూ ఉంటే మరో వైపు విష్ణు తన కెరియర్ కోసం అదే బూతుల పై ఆధార పడటం ఈ సినిమాలోని ట్విస్ట్ అనుకోవాలి..