పవర్ స్టార్ పాడిన 9 మాస్ సాంగ్స్..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సౌత్ లో ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే నమ్మాల్సిందే.. ఇక తెలుగు రెండు రాస్ట్రాల్లో అయితే పవర్ స్టార్ అభిమానులు కోట్లల్లోనే.. స్టైల్ కు సరికొత్త రూపమైన పవర్ స్టార్ అభిమామానుల్లో జోష్ నింపే ఫైట్స్.. అదిరిపోయే పంచ్ లనే కాదు సరదాగా గొంతు కూడా సవరించుకుంటాడు.. అది ఇప్పటినుండి కాదు తనకంటూ ఓ స్టైల్ కోసం పవర్ స్టార్ ఎప్పటినుండో ఇది చేస్తున్నదే.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన 9 మాస్ బీట్ సాన్స్ మీకోసం..

ఏం పిల్లా మాటాడవా (తమ్ముడు)


పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఈ పాటలో తెలుస్తుంది. ఓ వైపు ఎంత స్టైల్ గా ఉంటాడో తనలో ఉన్న మాస్ యాంగిల్ ని ఈ పాటతో చూపిస్తాడు.. ఫ్రెండ్స్ తో డ్యాన్స్ చేస్తూ పాడే ఈ సాంగ్లో పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ అద్భుతం. అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిట్ కారణం ఇలాంటి కారణాలవల్లే.

తాటి చెట్టెక్కలేవు (తమ్ముడు) 


తమ్ముడు సినిమాలోని ఈ పాట క్యారక్టర్ ఆర్టిస్ట్ మల్లిఖార్జునతో డిస్కస్ చేస్తూ పాడటం జరుగుతుంది. రమన గోగుల మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

బైబయ్యే బయ్యే బంగారు రమణమ్మ (ఖుషి)


ఖుషి సినిమాలోని ఈ సాంగ్ పవర్ స్టార్ తన స్నేహితుడు అలి వచ్చిన సందర్భంగా పాడటం జరిగుతుంది. హ్యాపీ మూడ్లో సాగే ఈ ఫోక్ సాంగ్ కు ఆలి గజల్ వాయిస్తుంటాడు.

నువ్వు సారా తాగుతు (జాని)


జాని సినిమాలో నారాయణ పాత్రను ఉద్దేశించి పాడే గీతం.. మద్యపానం వల్ల జరిగే అనర్దాల గురించి ఈ సాంగ్ లో ప్రస్థావించి తనదైన శైలిలో పాడారు పవన్ కళ్యాణ్.


 రావోయి మా ఇంటికి (జాని) 


పవన్ కళ్యాణ్ రచించిన ఈ సాంగ్ ఆయనే జాని సినిమాలో పాడటం జరిగింది. సమాజంలో ఉన్న దుష్ట శక్తులను గురించి ప్రస్థావిస్తూ ఈ సాంగ్ పాడటం జరుగ్తుంది. ఇందులో లిరిక్స్ స్మోక్, డ్రగ్స్, కరప్షన్, స్కాం అన్నిటిని బ్యాన్ చేయాలని రాశారు. 

కిల్లి కిల్లి (గుడుంబా శంకర్)


కిల్లి కిల్లి అంటూ మాస్ ఐటెం గా వచ్చే ఈ సాంగ్ పవర్ స్టార్ లోని మాస్ కోణాన్ని చూపించేలా చేస్తుంది. ముందు ఎత్తుకునేది పవర్ స్టారే అయినా తర్వాత సాంగ్ మొత్తం మల్లిఖార్జున్ పాడటం జరుగుతుంది. 

పాపారాయుడు (పంజా)  


పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ ఫిల్ పంజా.. సినిమాలో పోలీస్ పాపారాయుడిని ఆట పట్టిస్తూ వచ్చే ఈ సాంగ్ ఓ వైపు అతన్ని తిడుతూ మరోవైపు పొగడటం జరుగుతుంది. సినిమాకు ఈ సాంగ్ ఎంతో రిఫ్రెష్ మెంట్ ఇచ్చింది. ముందు పవన్ కళ్యాణ్ ఎత్తుకోగా తర్వాత సాంగ్ ను హేమ చంద్ర కంప్లీట్ చేస్తాడు.

కాటమ రాయుడా (అత్తారింటికి దారేది)


త్రివిక్రం సినిమాల్లో ప్రతిది సినిమాకు కచ్చితంగా సంబంధం ఉండేలానే ఉంటుంది. అయితే సరదాగా బ్రహ్మానందం ని ఆటపట్టించిన సందర్భంలో అతన్ని ఆడుకునే ఓ సాంగ్ కావాలని పట్టు బట్టి మరి పెట్టించాడు పవర్ స్టార్.. ఓల్డ్ క్లాసిక్ సుమంగలి సినిమాలోని కాటమ రాయుడా పాట దేవి కంపోజింగ్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు.  
 

పోతురాజు( సర్దార్ గబ్బర్ సింగ్)


సర్దార్ గబ్బర్ సింగ్ కు అన్ని తానై నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోతురాజు సాంగ్ కూడా పాడారు. ఫోక్ సాంగ్ లా వచ్చే ఈ సాంగ్ సినిమాకు మరింత జోష్ ఇస్తుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: