విలాసవంతమైన బహుమతిని తిరస్కరించిన పవన్ ?

Seetha Sailaja
సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఎంపరర్ గానే కొనసాగుతాడు అని చెప్పే ఒక నమ్మసక్యం కాని ఒక న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’  విడుదలకు ముందు ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ కు ఫైనాన్స్ సద్దుబాటు చేసిన ఒక ప్రముఖ ఛానల్ అధినేత్ పవన్ కళ్యాణ్ ని శరత్ మరార్ ద్వారా కలిసి ఒక అత్యంత ఖరీదైన కారును పవన్ కు బహుమతి గా ఇవ్వాలని తనకు కోరిక ఉంది అన్న విషయాన్ని బయట పెట్టాడట ఆ ఛానల్ అధినేత. 

అయితే అత్యంత మొహమాటస్తుడుగా పేరున్న పవన్ తనకు విలాస వంతమైన కార్ల పై కోరిక లేదని తనకు సౌకర్యావంతమైన ఒక మంచి కారు తనకు ఉందని పవన్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా ‘సర్దార్’ సినిమా వల్ల తనకు ఒక మంచి ఇల్లు కట్టుకునే అంత డబ్బులు వచ్చాయి అని నవ్వుతూ ఆ ఛానల్ ఓనర్ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించినట్లు టాక్.

అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోలు అంతా విలాస వంతమైన కార్లు కొనుక్కోవడంలో పోటీ పడుతూ ఉంటే పవన్ తన ఇంటికి వచ్చిన బహుమతిని తిరస్కరించడం పవన్ నిరాడంబరతను సూచిస్తోంది అని అoటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’  మూవీ బెనిఫిట్ షోలు, ఫస్ట్ డే కలిసి దాదాపు 21 కోట్ల రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల మొత్తం మీద 50 కోట్ల మార్క్‌ని దాటడం కష్టం అని అంటున్నారు.

మరొక అశ్చర్యకర విషయం ఏమిటంటే ‘తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ విశాఖ పట్టణం జిల్లాలలో ‘సర్దార్’ మొదటి రోజు కలక్షన్స్ ‘బాహుబలి’ మొదటి రోజు కలక్షన్స్ ను బ్రేక్ చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ‘సర్దార్’ ఇచ్చిన షాక్ తో పవన్ వెంటనే మరొక సినిమాను మొదలు పెడతాడా లేదంటే కొన్ని నెలలు మళ్ళీ రెస్ట్ లోకి పవన్ వెళ్ళిపోతాడా అన్న విషయమై రకరకాల మాటలు వినపడుతున్నాయి..
 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: