అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ‘సరైనోడు’ ఫస్ట్ డే ఫస్ట్ షో రిజల్ట్ ఇంకా బయటకు రాకుండానే ఈ సినిమాకు 4 స్టార్స్ రేటింగ్ రావడం అల్లు అర్జున్ అభిమానులను తీవ్రంగా కలవర పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే కైరా సాందు ఉమర్ తన ఇండియన్ సినిమా మ్యాగజైన్ లో ‘సరైనోడు’ సినిమా పై రివ్యూ రాస్తూ ఈ 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లండన్ గల్ఫ్ ప్రాంతాలలో తెలుగు సినిమాలను విడుదల చేసే కైరా మిడిల్ ఈస్ట్ దేశాలలో విడుదల ఆయ్యే సినిమాలను సెన్సార్ చేసే గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డు సభ్యుడుగా ఉండటంతో మన టాప్ హీరోల సినిమాలను ముందుగానే చూసి తన ఇండియన్ సినిమా మ్యాగజైన్ లో రివ్యూ రాయడమే కాకుండా రేటింగ్స్ కూడ ఇస్తూ ఉంటాడు కైరా. అయితే ఇతడు ఇచ్చే రేటింగ్స్ చాలా ఆశ్చర్య కరంగా ఉంటాయి.
ఈ నెలలోనే విడుదల అయిన పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు ఇతడు 5 స్టార్స్ రేటింగ్స్ ఇవ్వడంతో పవన్ అభిమానులు ఈ సినిమా పై ఎంతో ఆశలు పెట్టుకుని చివరకు ఆ సినిమా చూసి కోలుకోలేని షాక్ లోకి వెళ్ళి పోయిన విషయం తెలిసిందే. అయితే ఇదే కైరా సాంధు తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన ‘బాహుబలి’ కి 2 స్టార్ రేటింగ్ ఇచ్చి ఈ సినిమా విడుదలకు ముందు అందరికీ షాక్ ఇచ్చాడు.
దీనితో కైరా ఇచ్చిన రేటింగ్స్ కు వ్యతిరేకంగా ఆ సినిమా రిజల్ట్ వస్తోంది. ప్రస్తుతం కైరా ఇచ్చిన రివ్యూ రేటింగ్ వార్తలు బయటకు పొక్కడంతో అల్లుఅర్జున్ అభిమానులు విపరీతమైన టార్చర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న నెగిటివ్ వార్తలకు తోడు ఈ రేటింగ్స్ న్యూస్ కూడ బయటకు రావడంతో ‘సరైనోడు’ రిజల్ట్ పై మరింత ఆసక్తి పెరిగి పోతోంది..మరి కొద్ది గంటలలో అసలు విషయం తేలిపోతుంది .