"సరైనోడు" సెట్ అవుతాడా ? లేదా..?

Chakravarthi Kalyan
సరైనోడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా విశేషాలు చాలానే ఉన్నాయి. ఇందులో అప్ కమింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి అల్లు అర్జున్ సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమే కదా.. స్టార్ హీరోయిన్ రేసులో అందరికంటే ముందు ఉన్న ఈ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అల్లు సరసన హొయలు పోయింది. 

రకుల్ ప్రయారిటీ దానికేనట..



వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందో అన్న అంచనాలు చాలానే ఉన్నాయి. అయితే.. సినిమా సంగతి పక్కకు పెడితే.. పర్సనల్ విషయాలను కూడా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో షేర్ చేసుకుంది. ఇంతకూ మీరు ఎవరు సరైనోడు.. మీ సరైనోడు ఎలా ఉండాలి అని అడిగితే.. రకుల్ ఇంట్రస్టింగ్ పాయింట్స్ చెప్పింది. 

అంత పొడుగు ఉంటేనే సెట్ అవుతాడు సరైనోడు..



వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది.. హైట్ గురించి.. తాను ఇప్పటికే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటుందట. దీనికి తోడు హై హీల్స్ ఒకటి. అవి వేసుకుంటే ఇంచుమించు ఆరు అడుగులు అవుతుంది. సో.. తాను హై హీల్స్ వేసుకున్నా కూడా తన కంటే హైట్ ఉన్నవాడే తనకు అసలైన సరైనోడట. సో.. ఎవరైనా రకుల్ పై ఆశపెట్టుకోవాలంటే ముందు ఆరడుగులు ఉండాల్సిందేనన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: