సుస్వరాల జానకికి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

shami
కోకిల స్వరం కన్నా తీయనైనది.. వయసు నిమ్మిత్తం లేకుండా పాటలు పాడగలిగేది ఎవరు అంటే అందరు ముక్త కంఠంతో చెప్పేది ఒకే ఒక్కరు ఆమె ఎస్.జానకి. దక్షిణ భారత సిని ప్రేక్షకులను.. ముఖ్యంగా సంగీత ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయిన ఆమె సౌత్ ఇండియన్ నైటింగేల్ అని పిలుస్తారు. తెలుగు, తమిళం, మలయాళ కన్నడ భాషలతో శ్రోతలను అలరిస్తూ సౌత్ లోనే కాకుండా అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకి నేడే పుట్టిన రోజు.   


కెరియర్ మొదట్లో ఎస్. జానకి :


గుంటూరు జిల్లాల్లో పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నారు. గాయనిగా తన 19వ ఏటనే అవతారమెత్తిన జానకి 1957వ సంవత్సరంలో తన మొదటి పాటను పాడారు. తొలిసారిగా జానకమ్మ నేపథ్యగానం చేసింది 'విధియిన్ విళైయాట్టు' అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు ఆమె.  


తొలిపాట పాడిన సంవత్సరమే ఆమె దాదాపు 100 పాటకు పైగా పాడటం జరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలా పాడటం జానకమ్మకే సాధ్యం అనేలా చేసింది. ఇక పండు ముసలిగా కూడా ఆమె పాడిన సందర్భాలు ఉన్నాయి. హిందీ, సిన్హాలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషల్లో అమె నైపుణ్యం సంపాదించారు.


రికార్డింగ్ స్టూడియోలో పాడుతున్న జానకి :


జాంకి గారి మీద విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైన అభిమానం. 'సప్తపది' చిత్రం అనగానే ఎస్.జానకి.. ఆమె గళంలో వైవిధ్యభరితమైన పాటలు.. గుర్తొస్తాయి. అందుకే జానకమ్మని విశ్వనాథ్ గారు ఎంతో ప్రశంసిస్తారు. సినిమా పాటకి ఎస్.జానకి కామధేనువు లాంటిదని ఆయన అంటుండేవారు.. పాటకు కావాల్సిన ఏ స్వరాన్నైనా ఆమె పలికించగల అత్యున్నత గాయని అన్న ప్రశంసలు అందిస్తూ విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోనూ ఈంతో ఓ పాట పాడించేవారు.        


ఆమె జీవితకాలంలో 15 భాషల్లో 50వేల పాటలు పాడారు.. సినీపరిశ్రమలో 6తరాల కథానాయికలకు తన స్వరాన్ని అందించిన ఆమె 'భారత కోయిల' గా బిరుదు సాధించింది. ఇక ఆమె సంగీత ప్రస్థానంలో ఎన్నో రాష్ట్రీయ,జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్నారు.. ఇక ఎన్ని రివార్డులు అవార్డులు వచ్చినా ఇసుమంతైనా కూడా విరామమెరుగక నేటికీ సంగీత ప్రపంచంలో ఓ విధ్యార్ధియై వినయం ప్రదర్శిస్తూ సాధనను కొనసాగించడమే ఎస్.జానకి విజయానికి కారణం అని చెప్పలి. అందుకే ఆమె జీవితం నేటియువ సంగీత కళాకారులకు ఎంతో ఆదర్శం కూడా.. మరి భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్రను ఏర్పరచుకున్న ఎస్.జానకి గారికి మరోక్కసారి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం.  


జానకమ్మ పాడిన తెలుగు హిట్స్ సాంగ్స్ కోసం మీకోసం :


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: