నార్త్ నుండి వచ్చి సౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించింది రాధికా ఆప్టె. తెలుగులో లెజెండ్ సినిమాతో బాలయ్య సరసన నటించి టాలీవుడ్ లో హీరోయిన్స్ కు సరైన ఇంపార్టెన్స్ లేదు అంటూ కామెంట్ చేసి వెళ్లిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ ఫోబియా సినిమాలో నటిస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరిని ఇంప్రెస్ చేస్తుంది రాధికా ఆప్టె.
రకరకాల భయాలతో మాసిక స్థిమితం లేకుండా ఉండే పాత్రలో నటిస్తున్న రాధికా ఈ ఫోబియా సినిమా తనకు చాలా ప్రత్యేకం అంటుంది. అంతేకాదు తనను తాను నటినా మెరుగు పరచుకోడానికి ఇలాంటి పాత్రలైతేనే బెటర్ అంటుంది. ఇక కెరియర్ లో వెరైటీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ లా మారేందుకు తన ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఫోబియా సినిమా థీంను ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులి పవన్ కృపాలిని. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది రాధికా ఎందుకంటే ఈ సినిమాలో నటించడం కోసం అమ్మడు సైక్రియాటిస్ట్, ఇంకా మానసికంగా బాధపడే వారిని చూసి అభినయం చేసిందట.
ఇదో రకంగా తనకు సవాల్ లాంటి పాత్ర కాబట్టే అమ్మడు ఇంక కష్టపడుతుంది. ఇక ఇదే కాకుండా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న కబాలి సినిమాలో కూడా రాధికా ఆప్టె నటిస్తుంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాలో మరోసారి రజిని మాఫియా డాన్ గా కనిపించనున్నారు.