పైసా తీసుకోకుండా నటించిన కమల్

HANUMA HANUMA
సీతమ్మ అందాలూ... అనే పాట ఎక్కడ వినిపించినా కమల్ హాసన్ నిరాడంబరంగా తలగుడ్డతో ఉన్నట్టు ఓ సన్నివేశం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ సినిమా ఎలా మొదలైందో చిత్ర నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ సందర్భంలో నెమరేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే ‘‘నాకు ఓ రోజు కమల్ ఫోన్ చేసి అన్నయ్యా విశ్వనాథ్ అన్నయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. దానికి నువ్వు నిర్మాతగా ఉండాలి. మంచి కథతో సినిమా మొదలుపెడదాం అని అన్నాడు. నేను కూడా మా అన్నయ్య కె.విశ్వనాథ్ తో సినిమా చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆ సినిమా శుభ సంకల్పం. అందులోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత గొప్పగా కుదిరిందీ సినిమా. ఈ చిత్రంలో పనిచేసినందుకు కమల్ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోలేదు. ఆ సినిమా మొత్తం అతని కాస్ట్యూమ్స్ అన్నీ కలిపి రూ.15 వేలు కూడా ఖర్చు కాలేదు.’’అని వివరించారు బాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: