రికార్డుల గురించి మధన పడుతున్న బ్రహ్మోత్సవం !

Seetha Sailaja
మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ విడుదల కాకుండానే ఒక విషయంలో మహేష్ కు టార్చర్ ను క్రియేట్ చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం గత శనివారం ఈసినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా విడుదల చేయబడ్డ ఈసినిమా ట్రైలర్ అని అంటున్నారు. ఈ ట్రైలర్ కు మంచి టాక్ వచ్చినా ఈ ట్రైలర్ 1 మిలియన్ క్లిక్స్ టార్గెట్ ను చెరుకొవడానికి మూడు రోజులు పట్టింది.

అయితే మహేష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ కు వచ్చిన క్లిక్స్ ను చూస్తే 1 మిలియన్ మార్క్ క్లిక్స్ ను అందుకోవడానికి మూడు రోజులు పట్టడం కొంత ఆశ్చర్య పరిచే విషయం అని ఈ 1 మిలియన్ మార్క్ ను ‘బ్రహ్మోత్సవం’ ఇంకా ముందుగా అందుకోవలసి ఉండేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా రజినీకాంత్ ‘కబాలి’ ని పేర్కొంటూ ఆ సినిమా ట్రైలర్ విడుదలైన ఒక్క పూటలోనే 1 మిలియన్ మార్క్ హిట్స్ ను అందుకున్న నేపధ్యంలో ఆ స్పీడ్ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ లో కనిపించడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికితోడు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో తీసిన ఈసినిమా కథ మన ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలోని ప్రేక్షకులు ఎంతవరకు చూస్తారు అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్త పరుస్తున్నారు. మహేష్ క్రేజ్ రీత్యా ఈసినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చకపోతే కలక్షన్స్ విషయంలో రికార్డులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న కామెంట్స్ ను కూడ మరికొందరు చేస్తున్నారు. 

ఈ కామెంట్స్ అన్నీ మహేష్ దృష్టికి రావడంతో మరింత పక్కా వ్యూహంతో ‘బ్రహ్మోత్సవం’ పబ్లిసిటీని ప్లాన్ చేయాలని మహేష్ చాల తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని టాక్. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సరైనోడు’ 80 కోట్లకు పైగా కలక్షన్స్ ను రాబెట్టిన నేపధ్యంలో కనీసం 100 కోట్ల మార్క్ ను  ‘బ్రహ్మోత్సవం’ అందుకోలేకపోతే అది మహేష్ ఇమేజ్ పై పడుతుందని ఫిలింనగర్ విశ్లేషకుల వాదన.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: