సందీప్ కిషన్ కోరికకి సమంత షాక్
నిజానికి సందీప్ కిషన్ ఇప్పటికీ చిన్న హీరోగానే మార్కెట్ లో పేరు ఉంది. మరి ఇంతటి తక్కువ మార్కెట్ ఉన్న హీరో సరసన స్టార్ హీరోయిన్స్ నటించాలంటే వెనక బలమైన వ్యక్తి ఉండాలి. వారి సపోర్ట్ సందీప్ కి కచ్ఛితంగా ఉండి తీరాల్సిందే. అయితే సందీప్ కిషన్ కి ప్రముఖ సినిమాటోగ్రఫి చోటా.కె.నాయుడు సపోర్ట్ బలంగా ఉంది. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉండటంతోనే సందీప్ కి చోటా బలమైన సపోర్ట్ ని ఇస్తున్నాడు.
అయితే సందీప్ తన అప్ కమింగ్ మూవీలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడంట. ఈ విషయాన్ని మామ చోటాకి చెప్పిన సందీప్…చోటా సైతం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత, సందీప్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని కథలని సైతం ప్రస్తుతం చోటా వింటున్నారని అంటున్నారు. అయితే సమంత వద్దకి చోటా ఈ విషయాన్ని తీసుకుపోయినప్పుడు…సమంత షాక్ అయిందట.
సందీప్ అప్పుడే అంత పెద్ద హీరో అయ్యాడా? అనే సందేహం సమంతలో వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అడిగింది సాధారణ కెమెరామెన్ కాదు కాబట్టి…తప్పకుండా అంటూ సమంత మాట ఇచ్చినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిస్తున్నాయి.