ఘట్టమనేని శివరామకృష్ణ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శ్రీ వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు జన్మించిన ఆయన బి.ఎస్.సి వరకు చదువుకున్నారు. 1965లో తేనెమనసులు సినిమాలో మొదటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆయన ఆ సినిమాలో కనబరచిన నటనకు గాను ఆదుర్తి సుబ్బారావు గారే మరో అవకాశాన్ని ఇచ్చారు.
1967లో సాక్షి సినిమా బాపు దర్శకత్వంలో నటించిన కృష్ణ గారు ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే తేనేమనసులు సినిమాకు ముందు కృష్ణగారి సిని ప్రయాణం చాలా తెలుసుకుంటే..
కృష్ణ గారికి సినిమాల్లోకి రావాలని కోరిక :
కృష్ణగారు ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజ్ లో బి.ఎస్.సి చదువుతుండగా.. అక్కినేని నాగేశ్వర రావు గారికి సత్కారం జరిగింది. అయితే ఆ క్షణం తాను నటుడిని అయితే ఆ సత్కారాలు తనకు అందుతాయనే ఆలోచనతో కృష్ణగారు మద్రాస్ వెళ్లడం జరిగింది.
జగ్గయ్య, గుమ్మడి, చక్రపాణి తెనాలికి చెందిన వారు కావడం చేత మద్రాస్ లో వారిని కలిసేందుకు వెళ్లారు కృష్ణ. అయితే అప్పటికి ఇంకా లేత వయసులో ఉండటం వల్ల కాస్త టైం తీసుకుని రమ్మని చెప్పి పంపించారట. ఇక మళ్లీ తెనాలి తిరుగు ముఖం పట్టిన కృష్ణ గారు గరికపాటి రాజారావు రచించిన నాటకాల్లో పలు పాత్రలు పోశించారు.
మొదటి సినిమా అవకాశం :
1964లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు నూతన నటీనటులతో సినిమా తీస్తున్నామని ఆడిషన్ ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఫోటోలను పంపించిన కృష్ణ గారికి వారి నుండి కాల్ లెటర్ వచ్చింది. అదే కృష్ణగారి జీవితంలో మొదటి అవకాశం. తేనె మనసులు సినిమా మొదటి సినిమానే వంద రోజులు ఆడింది.
ఇక ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలోనే కన్నె మనసులు సినిమాలో కూడా నటించారు కృష్ణ గారు. ఆ టైంలో బాండ్ సినిమాలు వస్తున్న కారణంగా డూండేశ్వరరావు గూడాచారి 116 కు కృష్ణను ఎంపిక చేశారు. మొదటి స్పై సినిమాగా అది రికార్డు కెక్కింది. అప్పటి నుండి కృష్ణ గారికి ఆంధ్రా జేమ్స్ బాండ్ అని పిలుస్తుండే వారు.
ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ :
ఇక ఎందరో తలపెట్టి మా వల్ల కాదు అని వదిలేసిన మన్యం పులి 'అల్లూరి సీతారామరాజు' కథను తెర మీద ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో తెలియని వారికి తానులా కనిపించిన వీరుడు కృష్ణ గారు. అంతేకాదు 1950లో వచ్చిన దేవదాసుని 1970లో మళ్లీ కృష్ణ గారు విజయ నిర్మల దర్శకత్వంలో నటించారు.
కృష్ణ గారికే సాధ్యమైన రికార్డులు :
ఇక తెలుగు సినిమాల్లో మొట్టమొదటి ఈస్ట్ మన్ కలర్ సినిమా ఈనాడు.. మొదటి సినిమా స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, మొదటి 70 ఎం.ఎం సినిమా సిం హాసనం. మొదటి డి.టి.ఎస్ సినిమా తెలుగు వీర లేవరా లాంటి ఎన్నో తెలుగు సినిమా చరిత్రలో కొత్తదనానికి నాంధి పలికిన గ్రేట్ యాక్టర్ కృష్ణ గారు.
ఇక మోసగాళ్లకు మోసగాడుగా తన సత్తా చాటిన సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయా స్టూడియోస్ నిర్మించి ఆ సంస్థ నుండి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన నటనా ప్రతిభకు.. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి కళాకారుల విభాగంలో 2009లో కృష్ణ గారికి పద్మ భూషన్ ఇవ్వడం జరిగింది.
అల్లూరి సీతారామారాజులో సూపర స్టార్ కృష్ణ :
రాజీవ్ గాంధితో స్నేహ సంబంధం కలిగిన కృష్ణ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ లో పార్లమెంట్ సాభ్యుడిగా పనిచేశారు. ఇక కొంతకాలం తర్వాత రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం ఆయన రెండో తనయుడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాడు. ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తుంది ఎపిహేరాల్డ్.కాం.