నందిని రెడ్డి ఆశలపై నీళ్లు చల్లిన నితిన్..!

shami
లేడీ డైరక్టర్ గా అలా మొదలైందితో హిట్ అందుకున్న నందిని రెడ్డి తన రెండో ప్రయత్నంగా చేసిన జబర్దస్థ్ సినిమాతో కాస్త అబాసు పాలైంది. అయితే ఆ కసితో కళ్యాణ వైభోగమే సినిమా తీసి హిట్ అందుకున్న ఈ దర్శకురాలు తన తర్వాత సినిమా విషయంలో కన్ ఫ్యూజన్ లో ఉంది. ఇక నితిన్ తో కథా చర్చలు జరిపిన నందిని రెడ్డి నితిన్ తో సినిమా తీయాలని ఆరాటపడుతుంది.


అఆ లో నితిన్ : 


కాని నితిన్ మాత్రం అఆ హిట్ తో మరో రేంజ్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు నందిని రెడ్డితో చేస్తే మళ్లీ కెరియర్ రిస్క్ లో పడుతుందనే ఆలోచనతో రామ్ కు కొద్దిపాటి గ్యాప్ తర్వాత నేను శైలజ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇప్పటికే కిశోర్ కథ చెప్పడం అది నితిన్ ఓకే చేయడం అంతా జరిగింది.


ఇక ఇవే కాదు మిగతా దర్శకులు కూడా నితిన్ తో కథా చర్చలు జరిపారట కాని వీరందరి కన్నా కిశోర్ కే నితిన్ ఓటేశాడు. నేను శైలజ తర్వాత కిశోర్ చేసే ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. రచయితగా పనిచేసిన కిశోర్ తిరుమల మొదటి సినిమా సెకండ్ హ్యాండ్ అంతగా హిట్ అవ్వకపోయినా దర్శకుడిగా తన ప్రతిభ కనబరిచాడు. ఇక శైలజ హిట్ తో పరిశ్రమనంతా తన వైపు తిప్పుకునేలా చేశాడు.


కళ్యాణ వైభోగమే షూట్ లో నందిని రెడ్డి, నాగ శౌర్య :


సో నితిన్ తర్వాత సినిమా కిశోర్ తో అన్నమాట. మరి నితిన్ మీదే అన్ని ఆశలు పెట్టుకున్న నందిని మీద నీళ్లు చల్లేశాడు. అయితే కెరియర్ లో బెస్ట్ హిట్ ఇచ్చిన నాని హీరోగా సినిమా తీసే ప్రయత్నాల్లో ఉంది ఈ దర్శకురాలు. మరి ఆమె తర్వాత సినిమా ఏ హీరోతో చేస్తుందో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: