మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రాశిఖన్నాతో కలిసి ఈరోజు ఒక ప్రముఖ దిన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాల పై తన మనసులోని మాటలను బయట పెట్టాడు. సినిమా రంగంలో తరుచు హీరోల పై హీరోయిన్స్ పై వచ్చే లివింగ్ రిలేషన్ షిప్ గాసిప్పుల పై మాట్లాడుతూ ఫ్రెండ్ షిప్ వేరు అట్రాక్షన్ వేరు అంటూ కామెంట్స్ చేసాడు.
ఒక అమ్మాయిని ఫ్రెండ్ గా చూసినప్పుడు ఆ అమ్మాయి పై వేరే అభిప్రాయం కలగదని ఫ్రెండ్ ని లవర్ లా చూడలేము కదా అంటూ ఆ తేడా తెలియక చాలామంది చాల పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటారు అంటూ సెటైర్లు వేసాడు సాయి ధరమ్ తేజ్. ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా కూడ కొన్ని ఆ శక్తికర కామెంట్స్ సాయి దరమ్ తేజ్ పై చేసింది.
సాయి ధరమ్ తేజ్ తన తల్లిని బాగా చూసుకుంటాడు కాబట్టి రాబోయే తన భార్యను కూడ బాగా చూసుకునే మంచి హజ్బెండ్ అవుతాడు అని కామెంట్ చేస్తూ కాని తనకు కాబోయే భర్త మాత్రం సాయి ధరమ్ తేజ్ కన్నా ఎత్తుగా ఉండే అబ్బాయి కావాలని సాయి ధరమ్ తేజ్ హైట్ పై సెటైర్లు వేసింది రాశి ఖన్నా. ఇదే సందర్భంలో ఈ మెగా యంగ్ హీరో మరొక విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో అయినా ఒక హీరోయిన్ తో వరసగా రెండు మూడు సినిమాలు చేస్తే వారిద్దరి మధ్యా ఏదో ఉందని వార్తలు వ్రాస్తున్నారని చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు ఒక హీరోయిన్ తో వరసగా సినిమాలు చేసినా అప్పుడు ఎటువంటి రూమర్స్ లేవని కాని ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ మళ్ళీమళ్ళీ రిపీట్ అయితే వారిద్దరి పై వచ్చే గాసిప్పులు తలనొప్పిగా మారుతున్నాయి అంటూ రెజీనాను దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేసాడు ఈ యువ మెగా హీరో..