త్రిష ను అలా చూడగలమా...!

Prasad
తన అందం-అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి త్రిష. ఇటీవల కాలంలో సక్సెస్ రేటు తగ్గినా ప్రేక్షకుల్లో త్రిష కు ఉన్న గుర్తింపు వేరు. కాగా, విశాల్, త్రిష నటించిన ‘వేటాడు-వెంటాడు’ సినిమా ఈ నెల 24న విడుదల అవుతుంది. ఈ సినిమా తమిళంలో ‘సమర్’ పేరుతో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. హీరోతో సమానమైన పాత్రను త్రిష ఈ సినిమాలో పోషించిందని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో త్రిష పూర్తి స్థాయిలో నెగెటివ్ రోల్ చేసింది. దీంతో, నెగెటివ్ రోల్ లో త్రిష ను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు అభిరుచిలో చాలా తేడా వుంటుందని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. మరి, వేటాడు-వెంటాడు సినిమాలో నెగెటివ్ రోల్ తో తెలుగు ప్రేక్షకులను త్రిష ఎలా ఆకట్టుకుంటుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: