‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ ఇచ్చిన షాకులతో సతమతమైపోతున్న రామ్ చరణ్ కు దర్శకుడు సురేంద్ర రెడ్డి వ్యవహార శైలి పూర్తి తలనొప్పిగా మారిందని టాక్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా సేఫ్ గా ఉంటుందని ‘ధని ఒరువన్’ రీమేక్ ను నమ్ముకుని ‘ధృవ’ గా మార్చి చరణ్ చేస్తున్న ప్రయత్నానికి సురేంద్రరెడ్డి వ్యవహార శైలి అనుకోని తలనొప్పులు రామ్ చరణ్ కు తెప్పిస్తున్నట్లు టాక్. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఇప్పుడు ఈ న్యూస్ హాట్ గాసిప్ గా మారింది.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ప్రోగ్రెస్ పట్ల చరణ్ ఏ మాత్రo సంతృప్తిగా లేదని టాక్. ఇప్పటికే సగం సినిమా పూర్తికావాల్సిన ఈసినిమా పావు వంతు కూడా ఫినిష్ కాకపోవడంతో సురేందర్ రెడ్డి పై చెర్రి యమ సీరియస్‌గా ఉన్నాడనిఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి. ఈసినిమా అనుకున్నదానికంటే ఆలస్యంగా మొదలు అవ్వడం ఒక కారణం అయితే రీమేక్ కథని తెలుగులో మక్కీకి మక్కీ దించకుండా సురేంద్ర రెడ్డి ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో చేసిన ప్రయోగాలు చరణ్ కు ఏ మాత్రం నచ్చలేదని టాక్.
చరణ్ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సురేంద్రరెడ్డి ఈసినిమా స్క్రిప్ట్ లో చరణ్ చెప్పిన సూచనలు పాటించలేదు సరికదా పాటల ప్లేస్‌మెంట్ విషయంలోనూ చరణ్‌కీ, సురేంద్రరెడ్డికీ మధ్య అభిప్రాయ బేధాలొస్తున్నట్టు తెలుస్తోంది. ‘ధని ఒరువన్’ లో పాటలకు స్కోప్ తక్కువ. మసాలా అంశాలు ఉండవు. అయినా వాటిని రీమేక్ లో చేర్చాలని పట్టుపడుతున్నాడట చరణ్.
ఇలాంటి యాడింగులతో సినిమా ఫ్లేవర్ పోతుందని సురేంద్రరెడ్డి చెబుతున్నాడని టాక్. పైగా మేకింగ్ పేరుతో రోజుల తరబడి ఒకే సీన్ పదేపదే చెక్కుతూ సురేంద్రరెడ్డి వ్యవహరించడం చరణ్‌కి నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా స్పీడ్ పెంచమని చరణ్ సురేంద్రరెడ్డి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఈ పరిస్థుతులు ఇలాగే కొనసాగితే ఈసినిమా దసరాకు విడుదల కావడం కష్టమే అన్న భయాలు చరణ్ ను వెంటాడు తున్నట్లు వార్తలు వస్తున్నాయి..