కత్తిలాంటోడు పై మనమంతా సెటైర్లు !

Seetha Sailaja
మొన్న విడుదల అయిన ‘మనమంతా’ సినిమాపై టాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఈ సినిమాలోని మోహన్ లాల్ నటన కు విమర్శకుల నుంచే కాదు సినిమా అభిమానుల నుంచి కూడ మంచి స్పందన వస్తోంది.  ఒక తెలుగు నిర్మాత మరో తెలుగు దర్శకుడుతో కలిసి సామాన్య మధ్య తరగతి ప్రజల జీవితాలలో ఉండే సమస్యల గురించి వారి ఆలోచనల గురించి ఎంతో ఎంతో లోతుగా విశ్లేషిస్తూ ఈ సినిమాలో తీసిన సీన్స్ అందర్నీ మంత్ర ముగ్ధులను చేస్తోంది. 

అయితే ఈ సినిమాను చూసిన చాల మందికి కలుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది.  ఇంత సహజత్వంతో కూడిన ఈ మధ్య తరగతి అందమైన కథలో నటించడానికి ఏ టాలీవుడ్ సీనియర్ హీరో ఆ శక్తి చూపిoచలేదా ? లేదంటే అటువంటి పాత్రను మన టాలీవుడ్ హీరోలు ధైర్యంగా చేసినా  మన ప్రేక్షకులు ఒప్పుకోరా అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది.

టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలలో అగ్ర స్థానంలో ఉండి తిరిగి తన 150వ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న మెగా స్టార్ చిరంజీవి దృష్టి ఇటువంటి పాత్రల వైపు ఎందుకు పోలేదు అన్న ప్రశ్న సామాన్య ప్రేక్షకులకు రావడం సహజం. ఇలాంటి సహజత్వంతో కూడిన ఒక అందమైన కథలో చిరంజీవి నటిస్తే ఆ సినిమాకు ఎంతో హుందాగా ఉండటమే కాకుండా చిరంజీవిని నటుడుగా మరో మెట్టు ఎక్కిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే మెగా స్టార్ చిరంజీవి మనసు మాత్రం ఇప్పటికీ హీరోయిన్స్ తో వేసే స్టెప్స్ మీద రాజకీయ నాయకుల టార్గెట్ చేసే పంచ్ డైలాగ్స్ మీద ఉండటం తెలుగు సినిమా దౌర్భాగ్యం అనుకోవాలి. దీనితో ఇలాంటి కథలకు మళయాలం నుంచి మోహన్ లాల్ లాంటి దర్శకులను తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు ఆరు పదుల వయసు దాటి పోయిన తరువాత తన వయస్సుకు తగ్గ పాత్రలను చేసి మెప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఈ విషయంలో కొంత వరకు విక్టరీ వెంకటేష్ తన వయస్సుకు తగ్గ పాత్రలను చేయడానికి ‘దృశ్యం’ లాంటి సినిమాలో నటించి ప్రయత్నించినా వెంకటేష్ కూడ మారిపోయి ‘బాబు బంగారం’ లాంటి కమర్షియల్ సినిమాల వైపు వచ్చేస్తున్నాడు. టాప్ సీనియర్ హీరోలు అంతా తమకు 60 వయసుకు దగ్గర పడిపోతున్నా ఆ విషయాన్నే పట్టించు కోకుండా కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు.

ప్రస్తుత తరం టాలీవుడ్ టాప్ హీరోలు తమ ముఖంలో ముడతలు ఏర్పడుతున్నా అవి పట్టించు కోకుండా యంగ్ హీరోలతో రొమాన్స్ చేసే గ్లామర్ బ్యూటీలు కావాలి అంటున్నారు. దీనితో మంచి సినిమాలు తీసి సమాజానికి ఎదో ఒక మంచి చేయాలి అని ఆలోచిస్తున్న క్రియేటివిటీ ఉన్న తెలుగు దర్శకులు అంతా పరభాషా హీరోలు వoక చూస్తూ వారితో సినిమాలు తీస్తున్నారు అంటే టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: