సునీల్ ను పక్కన పెట్టారు

Prasad
కెరీయర్ ను ప్లాన్ చేయడంలో అల్లు అరవింద్ ను మించినవారు లేరు అని మరోసారి నిరూపించబడింది. అగ్ర నిర్మాతగా రాణిస్తున్న అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం హీరోగా మంచి పోజిషన్ లో ఉన్నాడు. అలాగే అల్లు శిరీష్ ను కూడా హీరోగా నిలబెట్టడానికి అరవింద్ ప్రయత్నాలు ప్రారంభించాడు. అల్లు శిరీష్ త్వరలోనే గౌరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తరువాత ‘ఈ రోజుల్లో..’ ‘బస్ స్టాప్’ సినిమాల దర్శకుడు మారుతి కొత్త చిత్రంలో శిరీష్ నటిస్తాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స్వయంగా నిర్మిస్తాడు. నిజానికి ఈ సినిమాలో మొదటగా హీరోగా సునీల్ ను తీసుకున్నారు. అయితే కథ బాగా రావడం, సినిమా మీద నమ్మకంతో సునీల్ తప్పించి ఆ స్థానంలో శిరీష్ చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: