లేటు వయస్సులో ఘాటు ప్రేమ

Prasad
ఇప్పడు ఒక పెళ్లి వార్త అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ‘హరేరామ హరే కృష్ణ’, ‘యాదోంకీ బారాత్’, ‘సత్యం శివం సుందరం’ వంటి చిత్రాలతో ఒక తరం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన జీనత్ అమన్ రెండో వివాహం చేసుకోనుంది. జీనత్ అమన్ కు ప్రస్తుతం 61 సంవత్సరాలు. ముంబయికి చెందిన ఓ యువ వ్యాపారవేత్త ను జీనత్ వివాహం చేసుకోనుంది. అతని వయస్సు 36 సంవత్సరాలు. అతన్ని తాను ఇటీవలే కలుసుకున్నానని, అతడు తన జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారాడని తనకు కాబోయే భాగస్వామి గురించి జీమత్ అమన్ తెలిపింది. కాగా, జీనత్ అమన్ మొదటి భర్త మజార్ ఖాన్. ఆయన కూడా నటుడే. తరువాత విడిపోయారు. వీరికి అజాన్ (26), జహాన్ (23) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు కూడా తన రెండో వివాహంపై చాలా సంతృప్తిగా ఉన్నారని జీనత్ అమన్ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: