పవన్కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎవరూ అంటే ఎవరైనా వెంటనే హీరో నితిన్ పేరు చెపుతారు. నితిన్ కూడ తన శక్తి మేరకు పవన్ కళ్యాణ్ భజన తన సినిమాలలో కొనసాగిస్తూ పవన్ వీరాభిమానుల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బయట సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడా కనిపించని పవన్ కూడ నితిన్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో కనిపిస్తూ తనకు దేవుడిచ్చిన తమ్ముడుని ప్రమోట్ చేస్తూ ఉంటాడు.
అటువంటి నితిన్ స్థానానినికి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికిచెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఎసరు పెడుతున్నాడా ? అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం వచ్చే నెల 20వ తారీఖున జరగబోయే నిఖిల్ తొలి భారీ బడ్జెట్ సినిమా ‘జాగ్వార్’ ఆడియో లాంచ్ కు పవన్ కళ్యాణ్ కుమార స్వామి పిలవగానే అంగీకరించడం అని అంటున్నారు.
ఒక కొత్త హీరో సినిమాకు 70 కోట్లు ఖర్చు పెట్టడం ఒక సంచలనం అయితే ఆ కొత్త హీరో సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తూ ఉండటం మరొక సంచలనంగా మారింది. ఇది ఇలా ఉండగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఇంటికి వచ్చినప్పుడు పవన్ మీడియా వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయమై రాజకీయాలలో హేమాహేమీలు చేయలేని పని తానోక్కడిని విమర్శిస్తే ఫలితం ఉంటుందా ? అంటూ కామెంట్ చేయడం బట్టి పవన్ మరి కొంతకాలం ఈ మౌన ముద్రను ఇలాగే కొనసాగిస్తాడేమో అన్న సందేహాలు చాలామందికి కలిగాయి.
అంతేకాదు అటు భారతీయ జనతాపార్టీని కాని ఇటు తెలుగుదేశం పార్టీని కాని ఏ మాత్రం విమర్సించకుండా పవన్ తన రెండు పడవల సిద్దాంతాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న కామెంట్స్ వినిపినిస్తున్నాయి. ఇప్పటికే మెగా కుటుంబంలో ఎందరో యంగ్ హీరోలు పోటీ పడుతున్న నేపధ్యంలో వారి సినిమా ఫంక్షన్స్ లో ఎప్పుడూ కనిపించని పవన్ నిఖిల్ గౌడ సినిమా ఆడియో ఫంక్షన్స్ కు అతిథిగా వస్తాను అనడం వెనుక ఎదో ఒక రాజకీయ కారణం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు సిద్ధాంతాలు ఎత్తుగడలు అర్ధంచేసుకోవడం ఎవరికీ అర్ధం కావు కాబట్టి పవన్ ఈ నిర్ణయం వెనుక కూడ ఎదో ఒక ఎత్తుగడ ఉండి ఉంటుంది అన్నది నిజం..