నేటి ఫిలిం న్యూస్ రౌండప్: సెప్టెంబర్ 6
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'ప్రేమమ్' చిత్రం తెరకెక్కింది. చైతూ సరసన శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం ఒక పాటను రిలీజ్ చేశారు. బ్యాంగ్ బ్యాంగ్ అనే మరోపాటను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 20న ఆడియో వేడుకను నిర్వహిస్తారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
మాస్ రాజా రవితేజ మరోసారి మాస్ పోలీస్ గా వచ్చేందుకు రెడీ అయ్యాడు. 'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. తమ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి నిజమేనని తాజాగా నల్లమలుపు శ్రీనివాస్ చెప్పాడు. రవితేజతో తాను చేస్తోన్న తొలి సినిమా ఇదని అన్నాడు. వక్కంతం వంశీ అందించిన కథ చాలా బాగా వచ్చిందని చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.
సూపర్ స్టార్ మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. హిందీలో 'అకీరా' సినిమా పనుల్లో బిజీగా వున్న మురుగదాస్, ఈ సినిమాకి బ్రేక్ ప్రకటించాడు. దాంతో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన మహేశ్, అక్కడ గౌతమ్ పుట్టినరోజు వేడుకలను జరిపాడు. నిన్న సాయంత్రమే ఆయన దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. గురువారం నుంచి మురుగదాస్ సినిమా మేజర్ షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి మహేశ్ రెడీ అవుతున్నాడు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
NTR
-
editor mohan
-
Director
-
Darsakudu
-
Shiva
-
lord siva
-
Cinema
-
Naga Chaitanya
-
Chitram
-
nageshwara rao akkineni
-
Jayanthi
-
Audio
-
Dussehra
-
Vijayadashami
-
October
-
Mass
-
raja
-
sree
-
srinivas
-
Kavuru Srinivas
-
ravi teja
-
vakkantham vamsi
-
tamannaah bhatia
-
Silambarasan
-
Mahesh
-
murugadoss
-
A R Murugadoss
-
Dubai
-
gautham new
-
gautham
-
gowtam
-
thursday