మాధురీ దీక్షిత్ కు అసలేమైంది ?


అద్భుత అందాల సోయగం,  సౌందర్యరాశి మాధురీదీక్షిత్  భారత్ నుండి మాయమైంది. అంటే ఆమె నెవరైనా కిడ్నాప్ చేశారనుకునేరు.  ఆమె నెవరూ కిడ్నాప్ చేయలేదు. అమె ఆమె క్షేమం.  మనొహరమైన  కార్యక్రమం  "ఝలక్ దిక్లా ఝా" లాంటి డాన్స్ రియాలిటి షో  చివరి ఎపిసోడ్ లో ఆమె భరింపరాని భుజం నొప్పితోనే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఈ  ఆరోగ్య సమస్యని ఆమె నిర్లక్ష్యం చేసినట్లు, ఇప్పుడు దీర్ఘకాల విరామం ప్రకటించి యుఎస్ కు వెళ్ళి పోయినట్లు అభిజ్ఞవర్గాల కథనం.

 

భరించలేని భుజం నొప్పితో గత కొంతకాలం నుండి బాధ పడుతున్నారామె. దానికి సరైన చికిత్స కోసం ఆమె అమెరికా వెళ్ళారు. ఆమె భర్త డాక్టర్ శ్రీరాం నేనె, ఒక ప్రముఖ కార్డియో వాస్కులార్ సర్జెన్. గతములో అక్టోబర్ 2011 లో భర్త, తన ఇరువురు కొడుకులు ర్యాన్ మరియు ఆరిన్ లతో కలసి ఇండియాకు (ముంబాయికి) తిరిగి రావటానికి ముందు 10 సంవత్సరాలు యుఎస్ లోని డెన్వర్ లో భర్తతో పాటు ఉండిపోయారు.

 

ప్రస్తుతం ఆమె భారత్ లో చికిత్స తీసుకుంటూనే ఆరొగ్యం విషయములో రెండవసారి సలహా తీసుకోవటం కోసం ఒక వారం క్రితం అనుభవజ్ఞుడు, డాక్టరైన తన భర్త శ్రీరాం తో కలిసి వెళ్ళినట్లు ఆమె కుటుంబ స్నేహితులొకరు తెలిపారు.

 

ఆమె 2011 లో తిరిగి రాగానే ఆమె కెంతో ఇష్టమైన టివి ప్రోగ్రాం డాన్స్ రియాలిటి షో, 'ఝలక్ దిక్లా ఝా'  ను కొత్తపుంతలు తొక్కించారు. ఆ షో అద్భుత విజయం సాధించింది. ఒకటి రెండు సినిమాల్లో ఆతిది పాత్రలు పోషించినా, సినిమాల్లో నటించటం కంటే టెలివిజన్ లో, తనను మైమరపించే నృత్య కార్యక్రమాల అభివృద్ధికే కృషిచేస్తూ ఉన్నారు.


మాధురి అత్యంత చక్కని ఆరోగ్యముతో తిరిగి త్వరగానే తిరిగి రావాలని కోరుకుందాం.   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: