నిన్నసాయంత్రం ఒకమీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ అనేక సంచలనవ్యాఖ్యలు చేసింది. తనను టార్గెట్ చేస్తూ వెకిలి కామెంట్స్ చేస్తున్నకొందరు అభిమానులపై ఆమె విరుచుకు పడింది. ప్రత్యక్షంగా పవన్ ఫ్యాన్స్ అని ఆమె అనకపోయినా పవన్ కళ్యాణ్ పై తనకు హక్కులేదు అనిఅనడానికి ఎవరికి హక్కు ఉంది అంటూ ఆమె మరో సంచలకామెంట్స్ చేసింది.
తాను పవన్ కళ్యాణ్ తో విడిపోయినంత మాత్రాన భార్యగా పవన్ పై హక్కు ఉండకపోవచ్చు కాని 17 సంవత్సరాల తమ స్నేహబంధం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికిలేదు అంటూ కామెంట్ చేస్తూ అన్యాపదేశంగా ఒకవిధంగా తనపై విమర్శలుచేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులలోని కొంతమందికి చురకలు అంటించింది రేణు దేశాయ్. పవన్ ‘జనసేన’ పెట్టి రాజకీయప్రవేశం చేసిన తరువాత పవన్ కళ్యాణ్ లోని రాజకీయచైతన్యాన్ని జనం చూస్తున్నారని అయితే 11సంవత్సరాలు పవన్ భార్యగా అతడితో ఉన్నప్పుడు రాత్రిసమయాలలో సమాజంగురించి రాజకీయాలగురించి ఆలోచిస్తూ మధనపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తనకన్నా పూర్తిగా తెలిసిన వ్యక్తి మరెవ్వరూ అంటూ రేణుదేశాయ్ మరోట్విస్టు ఇచ్చింది.
అంతేకాదు పవన్ ఇంటిలో వంటమనిషి ఉన్నా ప్రతిరోజురాత్రి గంటగంటకు వంటమనిషి చేత కాకుండా తనచేత అనేకసార్లు టీ పెట్టించుకున్న సందర్భాలు ఎన్నోఉన్నాయని అంటూ రేణుదేశాయ్ పవన్ కు సంబంధించిన ఎన్నోవిషయాలను ఆఇంటర్యూలో షేర్ చేసింది. అంతేకాదు అందరూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవచ్చు తానెందుకు పెట్టుకోకూడదు అంటూ పవన్ అభిమానులకు ఎదురుప్రశ్నలు వేస్తోంది రేణుదేశాయ్. అందరూ పవన్ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటే లైక్స్ వస్తున్నాయి తానుమాత్రం పవన్ ఫోటోలు పెట్టుకుంటే తిట్లు వస్తున్నాయి అంటూ సంచలనకామెంట్స్ చేసింది రేణుదేశాయ్.
తనకు ఫ్రీ పబ్లిసిటీకోసం పవన్ పేరును వాడుకుంటోంది అని వస్తున్న విమర్శలపై రేణుదేశాయ్ చాలఘాటుగా సమాధానం ఇచ్చింది. ఒకమిత్రుడుగా పవన్ గురించి మాట్లాడేహక్కు తనకు ఉంది అంటూ తనహక్కును హరించడానికి ఎందుకు కొంతమంది తనపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారో తనకు అర్ధంకావడం లేదు అనికామెంట్స్ చేసింది.
గతంలో పవన్ బర్త్ డే సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో కూడా పవన్ పర్మిషన్ తీసుకున్నాను అనిఅంటోంది రేణుదేశాయ్. ఆఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాట్లాడతానని తాను పవన్ తో చెప్పినప్పుడు ‘నీ జీవితం, నీ ఇష్టం’ అంటూ పవన్ అన్నమాటలను గుర్తుకు చేసుకుంది రేణు. ఎవరైనా తమ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ వారి ఫోటోలను వారి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారని అదేవిధంగా ‘నేనెందుకు నా ఫ్రెండ్ పవన్ గురించి మాట్లాడ కూడదు?’ అంటూ ఎదురుదాడి చేస్తోంది రేణుదేశాయ్. ‘ఒక్క సంతకం పెట్టి విడిపోయిన తర్వాత ఒకరికొకరం పరిచయం లేనట్లు ఉండాలా ? మామధ్య గొడవలు ఏమీలేవు అటువంటిది మావిషయమై మీకెందుకు ఆతృత’ అని అంటోంది రేణుదేశాయ్.
అకిరానందన్ గురించి అభిమానంగా మాట్లాడే పవన్ అభిమానులు అకిరాకు జన్మను ఇచ్చిన తనగురించి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో తనకు అర్ధంకావడంలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఇప్పటి నుంచి తాను అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రతిరోజు ట్విట్ చేయడమే కాకుండా తనదగ్గర ఉన్న పవన్ ఫోటోలను వరస పెట్టి షేర్ చేస్తాను అనిఅంటోంది రేణు. అయితే ఒకవైపు తాను పవన్ తో విడిపోయాను అనిచెపుతూనే పవన్ కళ్యాణ్ గురించి తన శక్తి మేరకు పొగడ్తలను కురిపిస్తున్న రేణుదేశాయ్ అంతరంగం ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది అనిఅడంలో ఎటువంటి సందేహం లేదు..