బుల్లితెర మీద అందాలను చిందిస్తూ ఆ ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆడియెన్స్ ను తన హాట్ హాట్ గ్లామర్ షోతో ఇంప్రెస్ చేస్తున్న రష్మి బుల్లితెర మీద తన కో ఆర్టిస్ట్ లతో తెగ ఇబ్బందులు పడుతుంది. జబర్దస్త్ పుణ్యమాని అందులోని కామెడీ ఆర్టిస్ట్ లకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక సుడిగాలి సుధీర్ రష్మిల ఎఫైర్ గురించి పబ్లిక్ టాక్ కూడా తెలిసిందే. పైకి ఏం లేదు ఏం కాదు అంటూ చెబుతూ లోపల చేయాల్సిందంతా చేసేస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరు ఢీ జోడి షోలో టీం లీడర్స్ గా ఉంటున్నారు. సుధీర్, రష్మిల మధ్యలో యాంకర్ ప్రదీప్ ఇక ఈ ముగ్గురి వీర ప్రతాపం ఆ షోలో కనిపిస్తుంది. ఎవరికి వారు తగ్గే ప్రసక్తే లేకుండా కానిచ్చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఈ షోలో సుధీర్ లేకుండా రష్మిని ప్రదీప్ ఏదో చేయబోతాడు. అప్పుడు ఆమె సుధీర్ అని పిలవగానే మనోడు వచ్చి ప్రదీప్ ను పక్కకు నెట్టి రష్మితో మిస్ బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా షోలో ఎంటర్టైనింగ్ లో భాగమే అయినా సరే రష్మిని మాత్రం అటు సుధీర్, ఇటు ప్రదీప్ ఇద్దరు తెగ ఆడుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రతి వారం ఓ స్పెషల్ గెస్ట్ జోడితో అలరించే ఢీ జోడి ప్రోగ్రాం లాస్ట్ వీక్ నందు, గీతా మాధురి జంటతో కార్యక్రమం నడిపించింది. ఇక బుల్లితెర మీద అలా తన హవా కొనసాగిస్తున్న రష్మి వెండితెర మీద సినిమా సినిమాకు ఇంకాస్త రెచ్చిపోతుంది. అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని రష్మి ఎలాంటి రోల్ అయినా చేసేందుకు సిద్ధమే అన్నట్టు కవ్విస్తుంది.
ప్రస్తుతం ఫాంలో ఉన్న రష్మి డబ్బు కోసమే అటు సుధీర్ ప్రదీప్ సరదాకి అన్నా సీరియస్ గా అన్నా ఏమాత్రం ఆలోచించకుండా లైట్ తీసుకుంటుంది. ఇదో రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ కాబట్టి అమ్మడు కూడా ఆ కామెంట్స్ ను ఎంజాయ్ చేస్తుంది. ఏది ఏమైనా జబర్దస్థ్ రచ్చ కాస్త ఢీ షోకి పాకిందని బుల్లితెర ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.