నిర్మలా కాన్వెంట్ లో ఈ స్పెషల్ మీకు తెలుసా..!

shami
నిర్మలా కాన్వెంట్ అంటూ శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పెట్టి ఓ టీనేజ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. నాగ కోటేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున కలిసి నిర్మించారు. ఇక సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమాలో ఫ్రెష్ టాలెంట్ ను ప్రమోట్ చేస్తూ వచ్చిన ఈ ప్రయత్నం గొప్పదని చెప్పాలి. అయితే నిర్మలా కాన్వెంట్ సినిమాతో కేవలం హీరో రోషన్ మాత్రమే కాదు మరో ఇద్దరు రోషన్ లు కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు.


శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేయగా ఇదే సినిమాలో నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల కూడా తొలి పరిచయమవడం జరిగింది. అసలు సుమ, రాజీవ్ లకు ఇంత పెద్ద బాబు ఉన్నాడా అనే రేంజ్లో అందరికి షాక్ ఇచ్చాడు ఆ కుర్రాడు. నిర్మలా కాన్వెంట్ లో హీరో రోషన్ పక్క ఫ్రెండ్ క్యారక్టర్ లో రోషన్ కనకాల చేయడం విశేషం.


ఇక మరో రోషన్ ఎవరు అంటే సినిమాకు మ్యూజిక్ అందించిన యువ సంగీత దర్శకుడు.. తన సంగీతంతో ప్రేక్షకుల మదిని పరవశింప చేసిన సాలూరి కోటి గారి తనయుడే రోషన్ సాలూరి. ఈ సినిమాతో మొదటి సినిమాకు సంగీతం అందించడం జరిగింది. ఇక మొదటి సినిమాతోనే నాగార్జున లాంటి స్టార్ హీరోతో పాట పాడించడం రోషన్ స్టామినా ఏంటో తెలియచేస్తుంది. 


సో అలా నిర్మలా కాన్వెంట్ కేవలం శ్రీకాంత్ తనయుడు రోషన్ మాత్రమే కాకుండా రాజీవ్ కనలకాల తనయుడు, కోటి తనయుడు కూడా పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అవడం జరిగింది. ఇక వీరే కాకుండా దేశం గర్వించే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ తనయుడు అమీన్ కూడా ఈ సినిమాలో మొదటి ఆట పాడటం జరిగింది. మరి ఈ రోషన్ త్రయం వారి వారి ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: