ఇన్నాళ్లకు విక్రమ్ మంచి హిట్ కొట్టాడు..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత ఆ తరహాలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేది ఓకే హీరో చియాన్ విక్రమ్.  మొదట్లో కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన విక్రమ్ అక్కడ  అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి హీరోగా గుర్తింపు పొందారు. తమిళంలో నటించిన సినిమాలు తెలుగు లో శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించాడు.

గత కొంత కాలంగా మనోడికి బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో తమిళంలో ఇరుముగన్ అనే మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ చిత్రం తమిళనాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో ‘ఇంకొక్కడు’ యావరేజ్ టాక్ వచ్చింది. తెలుగులో అంతగా హిట్ కాలేదు కానీ వసూళ్లు మాత్రం ఫర వాలేదనిపించాయి . తమిళంలో ఇరుముగన్ సినిమా విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ తో నడవటం..కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది.

ఈ చిత్రం ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరిందట. విక్రమ్ సరసన నయనతార ,నిత్యా మీనన్ లు నటించగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు . విభిన్న కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా కలెక్షన్ల ని వసూల్ చేసి వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకు పోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: