టీవీ షోలో ప్రకాష్ రాజ్ వీరంగం !

Seetha Sailaja
విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్ కోపం గురించి తెలియని వారు ఉండరు.  ఆ కోపమే ప్రకష్ రాజ్ కు అంత సమర్ధత ఉండి కూడ సినిమాలలో అవకాశాలు తగ్గేలా చేసింది అన్న కామెంట్స్ ఉన్నాయి.  తనకు సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ప్రకాష్ రాజ్ దర్శక నిర్మాతగా మారి కొన్ని విభిన్న చిత్రాలు నిర్మిస్తూ తన సత్తాను చాటడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ దసరాకు రాబోతున్న ‘మన ఊరి రామాయణం’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సహనాన్ని కోల్పోయి వీరంగం సృష్టించడం ఆ కార్యక్రమం చూస్తున్న వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఈ సినిమాకు సంబంధించిన వివరాలు చెపుతున్న ప్రకాష్ రాజ్ ను ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు ప్రకాష్ రాజ్ తన సహనాన్ని కోల్పోయి  తనకు పెట్టిన మైక్రోఫోన్ ను తీసి విసిరి వేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఆసక్తి కలిగించే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ప్రకాష్ రాజ్ ను ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న యాంకర్ ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కుదిపేస్తున్న కావేరీ జల వివాదం గురించి ఒక ప్రశ్న అడిగింది. అయితే ఈ ప్రశ్నకు కూల్ గా సమాధానం చెప్పే అవకాశం ఉన్నా ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయాడు. 

ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అని  అంటూ తన సినిమా గురించి మాట్లాడుకోవలసిన విషయాలు చాల ఉండగా రైతుల సమస్యలకు సంబంధించిన కావేరి జల వివాదంలో తనను ఎందుకు ఇరికిస్తున్నావు అంటూ ఆ యాంకర్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచాడు ప్రకాష్ రాజ్. అయితే జరిగిన పొరపాటును గ్రహించి ప్రకాష్ రాజ్ ఆ ఛానల్ యాజమాన్యానికి క్షమార్పణలు చెప్పడం కొసమెరుపు.

ఈమధ్య ప్రకాష్ రాజ్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తనలోని కోపం బాగా తగ్గిపోయిందని ఇప్పుడు చాల సహనంగా ఉంటున్నాను అంటూ కామెంట్ చేసాడు.  ఈ ఇంటర్వ్యూ వచ్చి కొద్దిరోజులు గడవ కుండానే ప్రకాష్ రాజ్ ఇలా వీరంగం సృష్టించడంతో ప్రకాష్ మారలేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది  ఇలా ఉండగా ఈ దసరా రేసును టార్గెట్ చేస్తూ అనేక భారీ సినిమాలు వస్తూ ఉన్నా వాటిని లెక్క చేయకుండా ప్రకాష్ రాజ్ చాల మొండిగా తన ‘మన ఊరి రామాయణం’ ను ఈ దసరా రేసును టార్గెట్ చేస్తూ విడుదల చేస్తూ ఉండటం ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: