‘బాద్ షా’ స్టోరీ ఇదేనండి..!

Prasad
శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘బాద్ షా’. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమౌతుంది. కాగా, ఈ బాద్ షా సినిమా కథ లీకయ్యింది. ఈ చిత్ర కథ ఏమిటంటే... స్పెయిన్ లోని మాఫియా లీడర్ ముఖేష్ రుషి కుమారుడు నవదీప్. ఇతను కాజల్ ను ప్రేమిస్తాడు. కాజల్ గురించి పూర్తి సమాచారం సేకరించమని డిటెక్టెవ్ జూనియర్ ఎన్టీఆర్ ను నవదీప్ నియమిస్తాడు. దీంతో కాజల్ ను వెంబడిస్తుంటాడు ఎన్టీఆర్. చదువు పూర్తియిన కాజల్ స్వదేశం ఇండియాకు చేరుకుంటుంది. ఆమెతో పాటు ఎన్టీఆర్ కూడా ఇండియా చేరుకుంటాడు. ఇండియాలో కాజల్ ను ప్రేమించిన అజయ్ ఆమెపై మీద యాసిడ్ దాడికి ప్రయత్నిస్తాడు. ఆ దాడి నుంచి కాజల్ ను రక్షించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరవాత ఆమెకు దగ్గర అవుతాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా మాఫియాకు చెందిన వ్యక్తే. కాగా, ఇండియాలో ఉన్న కాజల్ తల్లితండ్రులు ఆమె వివాహన్ని సిద్ధార్థతో జరపించడానికి నిర్ణయిస్తారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇండియా ఎందుకు చేరుకున్నాడు..., కాజల్ ను ఎలా దక్కించుకున్నాడో అన్నది చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: