2012 కలిసొచ్చిందన్న అమలాపాల్

HANUMA HANUMA
కేరళకుట్టి అమలాపాల్ త్వరలో ఆస్ట్రియాకు వెళ్ళనుంది. ఇటీవల ఇంటర్నేషనల్ సోప్ యాడ్ చేయడానికి ఒప్పుకుంది. ఈ యాడ్ షూటింగ్ ఆస్ట్రియాలో జరగనుంది. ఇందుకుగానూ అమల ఆస్ట్రియాకు వెళ్ళనుంది. ఈ మధ్యే తన కుటుంబసభ్యులతో అమెరికాను చుట్టొచ్చింది ఈ భామ. ‘‘ఇప్పటిదాకా నేను ఇండియాలోని పలు ప్రాంతాలను మాత్రమే చూశాను. 2012 నాకు బాగా కలిసొచ్చింది. చాలా సినిమాలు చేస్తున్నాను. ప్రపంచంలోని అందాలనుకూడా చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అంటోంది అమలాపాల్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: