రాజన్న కన్నా లక్ష్మక్క బెటర్

Prasad
మొత్తానికి మంచు లక్ష్మీ తన సత్తా చాటుకుంది. ఆమె నటించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘గుండెల్లో గోదారి’ సినిమా విడుదలైన రోజే హీరో రాజశేఖర్ నటించిన ‘మహంకాళి’ సినిమా కూడా విడుదల అయ్యింది. అదే ఈ ‘మహంకాళి’ సినిమా కంటే ‘గుండెల్లో గోదారి’ సినిమా చూడ్డానికే ప్రేక్షకులు ఆసక్తి చూపినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘గుండెల్లో గోదారి’ సినిమాకు మొదటి నుంచి మంచి ప్రచారం నిర్వహించారు. పైగా ఈ సినిమాలో తాప్సీ, ఆది, సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలు విజయవంతం అయ్యాయి. ఇలాంటి కారణాలతో ‘గుండెల్లో..’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ‘మహంకాళి’ సినిమాకు ఇలాంటి ఆకర్షణలు లేవు. దీంతో ఈ సినిమాపై ‘గుండెల్లో..’ పై చేయి సాధించింది. గుండెల్లో గోదారి సినిమాకు మొదటి రోజున 3.25 కోట్ల రూపాయిల కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఇప్పటి వరకూ 6.72 కోట్ల రూపాయిల వసూళ్లను ఈ సినిమా సాధించింది. మొత్తం 12 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ఈ విధంగా కలెక్షన్లు సాధించడంతో ‘గుండెల్లో గోదారి’ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే అని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ‘గుండెల్లో గోదారి’ సినిమాకు సోమవారం నుండి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలని, అయితే కొత్త సినిమాలు లేకపోవడం, ‘మిర్చి’ హావా తగ్గడం ‘గోదారి’కి కలిసివస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: