కిక్ ఇవ్వలేదన్న సల్మాన్

Chowdary Sirisha
అందరూ రచయితలు కాలేదు. అందరు రచయితలూ సినిమా రచయితలు కాలేరు. అవును, ఇది అక్షరాలా నిజం. చేతన్ భగత్... భారతదేశం గర్వించదగ్గ రచయిత. అలాంటి రచయిత ఒక సినిమాకి మంచి స్క్రిప్ట్ ఇవ్వలేకపోయాడు. ఈ విషయం చెప్పంది అల్లాటప్పా వ్యక్తి కాదు... సాక్షాత్తూ సల్మాన్ ఖాన్. వాళ్లిద్దరి గొడవా మనకెందుకు అంటారా...  మనకూ సంబంధం ఉంది. అదెలా అంటే... తెలుగులో సూపర్ హిట్టయిన చిత్రం కిక్. రవితేజకూ, దర్శకుడు సురేందర్ రెడ్డికీ మంచి విజయాన్ని సంపాదించిపెట్టిన చిత్రమిది. దీన్ని హిందీలో సల్మాన్ తో రీమేక్ చేయాలనుకున్నాడు దర్శకుడు సాజిద్ ఖాన్.  మరి, కథలో మార్పులు ఎవరు చేస్తారు? ఆ బాధ్యతను ప్రముఖ రచయిత చేతన్ భగత్ తీసుకున్నాడు. కథనం, డైలాగులు రాసి సల్మాన్ కి చూపించాడు. అది చూసిన సల్మాన్... ఇందులో కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన లక్షణాలు లేవు అన్నాడట. దాంతో మళ్లీ చేతన్ భగత్ స్క్రిప్ట్ పనిలో మునిగిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: