ఇక్కడ రీమేక్ లు చేయనంటున్న రామ్ చరణ్

Chowdary Sirisha
బాలీవుడ్ లో ఓ రీమేక్ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు రామ్ చరణ్. మరి, తెలుగులో రీమేక్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా? అంటే, లేదనే చెబుతున్నాడు. తెలుగులో ఏదైనా చిత్రాన్ని రీమేక్ చేస్తే అది సాహసమే అవుతుంది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాంటే... ‘నిజానికి చాలామంది నన్ను రీమేక్ లు చేయమని అడుగుతున్నారు. ముఖ్యంగా నాన్నగారు నటించిన ఖైదీ, జగదీకవీరుడు అతిలోకసుందరి రీమేక్ ఆఫర్లు నా దగ్గరకి వచ్చాయి. అయితే, క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేయకూడదనే అనుకుంటున్నాను. ఎందుకంటే, వాటికి చాలామంది అభిమానులు ఉంటారు. ఒకవేళ రీమేక్ చేస్తే భారీ అంచనాలతో థియేటర్లకి వస్తారు. ఏ కాస్త తప్పు జరిగినా వాళ్లని అలరించడం చాలా కష్టమైన పని. అందుకే కొన్ని చిత్రాలను అలా చూస్తేనే అందంగా ఉంటాయి’ అని చెబుతున్నాడు. చాలా రోజులుగా ఖైదీ రీమేక్ పై జరుగుతున్న చర్చకు ఓ రకంగా చెర్రీ తెర దించేసినట్టే అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: