ఎవ్వరి దగ్గరా పని చేయని సంగీత దర్శకుడు

Prasad
తెలుగు లో ఏ సంగీత దర్శకుడుకు లేని గొప్పతనం ఒకటి సాలూరి రాజేశ్వరరావుకు ఉంది. అది ఏమిటంటే ఆయన ఎవ్వరి వద్ద సహాయకుడుగా పనిచేయలేదు. తెలుగు లో ఏ సంగీత దర్శకుడును పరిశీలించినా.. వారు ఎవరో ఒకరి దగ్గర సహాయకులుగా పనిచేసిన వారే.. అనాటి ఘంటసాల వేంకటేశ్వరరావు దగ్గర నుంచి ఈనాటి తమన్ వరకూ అందరూ ఇలా పని చేసినవారే... అయితే సాలూరి రాజేశ్వరరావు మాత్రం ఇందుకు మినహాయింపు. తెలుగులో ఎన్నో అణిముత్యాలు లాంటి పాటలను స్వరపరిచిన సాలూరి రాజేశ్వరరావు మాత్రం ఎవ్వరి వద్ద సహయకుడిగా పనిచేయలేదు. నేరుగా సంగీత దర్శకుడుగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ముందు ‘విష్ణుశీలి’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకుడుగా పనిచేసిన సాలూరి ‘జయప్రద’ అనే సినిమాతో తెలుగులోకి ప్రవేశించారు. కాగా, ‘శ్రీకృష్ణ లీలలు’ అనే సినిమాలో బాలనటుడిగా నటించిన సాలూరి రాజేశ్వరరావు ఆ పాత్రకు సంబంధించిన పాటలు, పద్యాలను తనే సమకూర్చుకోవడం విశేషం. అలాగే, నేడు ప్రముఖ సంగీత దర్శకుడుగా రాణిస్తున్న కోటి  సాలూరి రాజేశ్వరరావు కు కుమారుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: