కత్రినాతోనే సల్మాన్ షాదీ

Prasad
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మళ్లీ సంచలనం సృష్టిస్తున్నాడు. ‘ఏక్ థా టైగర్‘ సినిమా ప్ర్రచార కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ జీవితాతం బ్రహ్మచారిగా ఉండాలని లేదని, త్వరలోనే పెళ్లి కబురు చెబుతానని అన్నాడు. దీంతో సల్మాన్ పెళ్ళి వార్త మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అలాగే సల్మాన్ తాను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి చెప్పకపోయినా చాలా మంది కత్రినానే సల్మాన్ వివాహం చేసుకుంటాడని భావిస్తున్నారు. కత్రినా కూడా ఇటీవల కాలంలో సల్మాన్ కు దగ్గరా వస్తుండటం, ‘ఏక్ థా టైగర్‘లో ఇద్దరూ ఆన్ స్ర్కీన్ రొమాన్స్ ను సూపర్బ్ గా పండించడంతో ఈ ఆలోచనకు బలం వస్తుంది. అలాగే కత్రినా కూడా సల్మాన్ కాదని నడిపిన ఆఫైర్స్ అన్నీ బెడిసి కొట్టాయి. దీంతో సినిమాల్లో తనకు లైఫ్ ఇచ్చిన సల్మానే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: